Detox Tips: డీటాక్స్ అంటే ఏంటి, శరీరాన్ని డీటాక్స్ చేసే సులభమైన పద్ధతులివే

Detox Tips: శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్దాలు పేరుకుపోతుంటాయి. సమయానుకూలంగా ఆ వ్యర్దాల్ని తొలగించుకోవాలి. లేకపోతే అనారోగ్యం వెంటాడుతుంది. వ్యర్దాల్ని తొలగించడమే డీటాక్సిఫికేషన్. ఇదెలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 10:18 PM IST
Detox Tips: డీటాక్స్ అంటే ఏంటి, శరీరాన్ని డీటాక్స్ చేసే సులభమైన పద్ధతులివే

Detox Tips: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. బయటి తిండి తినడం, జంక్ పుడ్, ఫాస్ట్ ఫుడ్ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. బాడీ డీటాక్స్ చేస్తే ఈ సమస్య నుంచి ఉపసమనం పొందవచ్చు. మరి డీటాక్స్ చేయాలంటే ఏం చేయాలి. ఆ వివరాలు మీ కోసం..

ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల ఆహారపు అలవాట్లతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా బయటి తిండి తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. బయటి తిండి తిన్నప్పుడు శరీరాన్ని తప్పనిసరిగా డీటాక్స్ చేయాలి. ఎందుకంటే డీటాక్స్ చేయడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాడీని డీటాక్స్ చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిథ పదార్ధాలతో సులభంగా శరీరాన్ని డీటాక్స్ చేయవచ్చు.

నిమ్మరసం

సోడియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసం బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అని చెప్పవచ్చు. డీటాక్స్ చేసేందుకు నిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంతో ఇమ్యూనిటీ వృద్ధి చెందడమే కాకుండా..విష పదార్ధాలు చాలా సులభంగా తొలగిపోతాయి. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు రోజూ పరగడుపున నిమ్మరసం తాగితే మంచి ఫలితాలుంటాయి.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఔషధపరంగా చాలా అద్బుతమైనవి. ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కొబ్బరి నీళ్లను మించినవి లేవంటారు వైద్యులు. కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలనేవే ఉండవు. ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంటాయి. కొబ్బరినీళ్లలో సోడియం, పొటాషియం, విటమిన్ సి పెద్దమొత్తంలో ఉండటం వల్ల డీటాక్సిఫికేషన్‌కు దోహదపడుతుంది.

కాలిఫ్లవర్

కూరగాయల్లో కాలిఫ్లవర్ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కాలిఫ్లవర్ తినడం వల్ల బాడీ పూర్తిగా డీటాక్స్ అవుతుంది. ఎందుకంటే కాలిఫ్లవర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడంతో పాటు కడుపుని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Also read: Health Tips: డయాబెటిస్ తీవ్రమైతే క్రూర పరిణామాలివే, అప్రమత్తం కాకుంటే అంతే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News