Vitamin D: విటమిన్‌ డి లోపించిందని చెప్పే కీలకమైన లక్షణాలు ఇవే!

Vitamin D Deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనుకొనేవారు వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే చాలా మంది విట‌మిన్ డి లోపంతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 12:30 PM IST
Vitamin D: విటమిన్‌ డి లోపించిందని చెప్పే కీలకమైన లక్షణాలు ఇవే!

Vitamin D Deficiency: మన శరీరానికి వివిధ రాకల పోషకాలతో అవసరం పడుతుంది. అందులో ముఖ్యంగా విటమిన్‌ డి ఎంతో కీలకమైన ప్రాత పోషిస్తుంది. దీనిని మనం ప్రతిరోజు ఉదయం వచ్చే సూర్యకిరణాల్లో పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా విటమిన్‌ డి తో ఎముకలు, రోగనిరోధక శక్తి, మానసిక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నేటి కాలంలో ఆహారం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా మంది విటమిన్‌ డి సమస్య బారిన పడుతున్నారు.  విట‌మిన్ డి లోపం ఎక్కువ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అయితే విటమిన్ డి లోపం మీలో ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి శ‌రీరంలో విట‌మిన్ డి లోపించింద‌ని మ‌నం తెలుసుకోవ‌చ్చు. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మీ శరీరంలో విటమిన్‌ డి తక్కువగా ఉండే తరుచు తల తిరిగినట్టుగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్‌ డి తగ్గితే  కీళ్ల నొప్పులు, భుజం నొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. అంతేకాకుండా క్యాల్షియం లోపం కూడా మొదలవుతుంది.

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం కూడా విటమిన్‌ డికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.

Also read: Pimples: మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి!

తీవ్రమైన ఒత్తిడి, ఆందోళ వంటి సమస్యలు కనిపిస్తే విటమిన్‌ డి లేదని భావించాలి.

జుట్టు ఎక్కువ‌గా ఊడిపోవడం గమనిస్తే విటమిన్‌ డి లోపించిందని గుర్తించాలి.

 విటమిన్‌ డి తక్కువగా ఉంటే నిద్రలేమి స‌మ‌స్య మొద‌లువుతుంది. 

ఇలాంటి ల‌క్ష‌ణాల‌ను మీ శ‌రీరంలో కనిపిస్తే విట‌మిన్ డి లోపించింద‌ని తెలుసుకోవాలి. ఈ స‌మ‌స్య నుంచి బయట పడాలి అనుకొనే వారు  చికిత్స తీసుకోవాలి. అలాగే విటమిన్ డి ఎక్కువ‌గా లభించే ఆహారాల‌ను తీసుకోవాలి. విటమిన్‌ డి ఉండే ఆహార పదార్థాలు ఇవే  చేప‌లు, గుడ్డు, ఓట్ మీల్, పాలు.  వీటిని క్రమం తప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో విట‌మిన్ డి లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది.

Also read: Cholesterol Tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా మజ్జిగ చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News