Iron Rich Foods: మనిషి శరీరానికి అవసరమైన ఏ విటమిన్ లేదా మినరల్ లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే హెల్తీ ఫుడ్స్ అనేది చాలా చాలా అవసరం. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన పూర్తి పోషకాలు సమృద్ధిగా అందే అవకాశముంటుంది. మనిషి శరీరానికి కావల్సిన పోషకాల్లో ముఖ్యమైంది ఐరన్.
ఐరన్ లోపం అనేది సాధారణంగా హెల్తీ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్లనే సంభవిస్తుంది. ఐరన్ లోపముంటే ప్రమాదకరమైన ఎనీమియాకు దారితీస్తుంది. మీలో ఎవరికైనా తరచూ తలనొప్పి, అలసట, ఆకలి మందగించడం, విసుగు, జుట్టు రాలడం, గోర్లు విరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటి పూత, తల తిరగడం వంటి లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం అలసత్యం ప్రదర్శించవద్దు. ఈ లక్షణాలు ఎనీమియా లక్షణాలు. అంటే మీ శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్టే అర్ధం. శరీరంలో రక్త హీనత అనేది చాలా రకాల సమస్యలకు కారణమౌతుంది. రక్త సరిగ్గా సరఫరా కాకుంటే ఆక్సిజన్ అన్ని అవయవాలకు చేరదు. దాంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావచ్చు. అందుకే ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదంటారు. ఐరన్ లోపం ఎప్పటికీ తలెత్తకుండా ఉండాలంటే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా 5 రకాల పండ్లను డైట్‌లో చేర్చాలి.
రెడ్ షిమ్లా మిర్చిలో ఐరన్ తో పాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. మొక్కల ద్వారా లభించే ఐరన్ , ఇతర పోషకాల సంగ్రహణకు విటమిన్ సి అద్భుతంగా ఉపయోగపడుతుంది. రెడ్ షిమ్లా మిర్చిని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఐరన్ కొరత తీర్చేందుకు కూరగాయల్లో అద్భుతమైంది బీట్‌రూట్ అనే చెప్పాలి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్‌తో పాటు ఫోలేట్, విటమిన్ సి కూడా ఉంటాయి. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల రక్త సరఫరా సైతం మెరుగుపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో దోహదం చేస్తుంది.
ఐరన్ లోపం తీర్చేందుకు ఫ్రూట్స్‌లో బెస్ట్ అంటే దానిమ్మ అనే చెప్పాలి. ఇందులో కావల్సినంత ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెద్దఎత్తున లభిస్తాయి. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ రకాల ఇతర వ్యాధులు దూరం చేయవచ్చు. ఇక రాజ్మా కూడా మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయి. శాకాహారులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఐరన్ లోపం దూరం చేసేందుకు వారంలో కనీసం 3 సార్లు తీసుకోవాలి.
ఇక చివరిది బెల్లం. డయాబెటిక్ రోగులు కాస్త దూరంగా ఉండాలి. కానీ ఐరన్ లోపానికి మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇన్‌స్టంట్ ఎనర్జీ కూడా లభిస్తుంది.
Also read: Calcium Rich Foods: ఎముకలు గుల్లగా ఉండి ఆస్టియోపోరోసిస్ సమస్య ఉందా..ఈ 5 ఫుడ్స్ తీసుకుంటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి