ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం

Omicron Variant Symptoms: కరోనా కొత్త వేరియంట్ భయం ఇప్పుడు ప్రపంచమంతా వెంటాడుతోంది. అసలు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. డెల్టా వేరియంట్ కంటే భిన్నంగా ఉన్న ఆ లక్షణాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2021, 09:58 AM IST
  • దక్షిణాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలివే
  • ఒమిక్రాన్‌లో లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాలకు పూర్తిగా విభిన్నం
  • ఒమిక్రాన్‌లో ప్రధానంగా తీవ్రమైన అలసట, మాంసపు భాగాల్లో నొప్పి
ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం

Omicron Variant Symptoms: కరోనా కొత్త వేరియంట్ భయం ఇప్పుడు ప్రపంచమంతా వెంటాడుతోంది. అసలు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. డెల్టా వేరియంట్ కంటే భిన్నంగా ఉన్న ఆ లక్షణాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) ప్రపంచమంతా కలకలం రేపుతోంది. ఎక్కడికక్కడ దేశాలు మరోసారి ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ యూరప్ సహా వివిధ దేశాల్లో విస్తరించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వైద్యుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయనేది వివరించాడు. ఈ కొత్త వేరియంట్‌లో కొన్ని లక్షణాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయంటున్నారు వైద్యులు. అయితే ఒమిక్రాన్ సంక్రమించివారిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని..ఆసుపత్రుల్లో చేరకుండానే కోలుకున్నారని తెలుస్తోంది. 

దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛీఫ్ చెప్పిందాని ప్రకారం గత 10 రోజుల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన 30 మంది రోగుల్ని పరిశీలించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో అలసట ఎక్కువగా ఉంటోంది. గొంతులో ఇబ్బంది, శరీరంలోని మాంసపు భాగాల్లో నొప్పి, పొడి దగ్గు వంటి ప్రధాన సమస్యలున్నాట్టు గుర్తించారు. ఈ వేరియంట్ లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాలకు విభిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ తాను చూసిన ఒమిక్రాన్ కేసుల్లో ఎవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛీఫ్ డాక్టర్ ఏంజెలిక్ కోఎన్జీ తెలిపారు. ఈ అందరిలో ఒమిక్రాన్ లక్షణాలు(Omicron Variant Symptoms) స్వల్పంగా ఉన్నాయంటున్నారు. యూరప్‌లో ఒమిక్రాన్ సోకినవారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఎక్కువగా 40 ఏళ్ల వయస్సువారికి ఒమిక్రాన్ సోకిందంటున్నారు. 

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా(South Africa) దేశానికి చెడ్డపేరు వచ్చిందంటున్నారు. దాంతో యూరప్ సహా చాలా దేశాలు దక్షిణాఫ్రికాకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికాను వేరు చేశారని..ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. వాస్తవానికి దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు కొత్త వేరియంట్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేసిందన్నారు. అలా చేసినందుకు దక్షిణాఫ్రికాను ప్రశంసించాల్సింది పోయి..నిందించడం మంచిది కాదంటున్నారు. యూరప్ దేశాలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఆ దేశాల్లో కేసులు పెరిగాయంటున్నారు. 

Also read: ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకింత ప్రమాదకరం, రోగనిరోధకత కూడా పనిచేయదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News