Coronavirus మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడంలో శానిటైజర్లు ( Sanitizers ) చాలా ముఖ్యమైనవి. ఐతే, శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ( Health experts ) హెచ్చరిస్తున్నారు. శానిటైజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తే.. చర్మ సమస్యలు వస్తాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అన్లాక్ ( Unlock ) ప్రక్రియ మొదలయిన తరువాత కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే శానిటైజర్లపై ప్రజలు ఆధారపడటం కూడా అదే స్థాయిలో పెరిగింది. కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి చేతులు తరచుగా కడుక్కోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ప్రజలను కోరారు. అయితే అదే సమయంలో శానిటైజర్లను ఎక్కువగా కూడా వినియోగించకూడదు అని హెచ్చరించారు. Also read: COVID-19: రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
శానిటైజర్లను ఎక్కువగా వాడకూడదు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు సేవల డైరెక్టర్ జనరల్ ( Ministry of Health) డాక్టర్ ఆర్.కె.వర్మ అన్నారు. " ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు ధరించండి, వేడినీరు తరచుగా తాగండి ( Hot water ), చేతులు శుభ్రంగా కడుక్కొండి. అంతేకానీ శానిటైజర్లను అతిగా ఉపయోగించకండి'' అని వర్మ పేర్కొన్నారు. Also read: Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?
Over use of Sanitizers అధికంగా శానిటైజర్ వాడడం వల్ల కలిగే నష్టాలు:
శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయని పలు నివేదికలు, నిపుణులు తెలిపారు. నివేదికల ప్రకారం, బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతమైన హ్యాండ్ శానిటైజర్లు మైక్రో బయోమ్లకు హాని కలిగించవచ్చు, అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. శానిటైజర్లు ఎక్కువగా వాడడం వల్ల చేతులు పొడిబారి పోతాయి, అలాగే అనేక చర్మసంబంధిత సమస్యలకు దారితీస్తుంది. శానిటైజర్ ని ఎక్కువగా ఉపయోగించిన వారిలో చర్మ సమస్యలు, చేతులు బాగా పొడిబారడం, చేతులు మంటలు రావడం, చర్మం ఎర్రబడటం వంటి వాటితో పాటు పగుళ్లు, రక్తస్రావం కూడా సంభవిస్తున్నాయని చెపుతున్నారు. Also read: మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?
Things to remember శానిటైజర్లను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు :
పరిమిత వినియోగం: హ్యాండ్-శానిటైజర్లను పరిమితిలో వాడడం వల్ల చేతి చర్మ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దీని కోసం, బయటికి వెళ్లినప్పుడు అనవసరమైన వస్తువులను తాకకుండా ఉండండి.
Moisturizer మాయిశ్చరైజర్స్ : ఒకవేళ మీ చేతులు పొడిగా లేదా సున్నితంగా మారినట్లయితే లేదా చేతి శానిటైజర్లను ఉపయోగించిన తర్వాత మీ చర్మంపై పగుళ్లు ఏర్పడితే, మాయిశ్చరైజర్లను రాసుకుంటే ఫలితం ఉంటుంది.
Soap wash సబ్బు : కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి సబ్బు, నీటితో తరుచుగా చేతులు కడుక్కోవడం మంచిది. ఎక్కువ గాడత లేని సబ్బులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. సబ్బులు సూక్ష్మక్రిములను చంపడంలో మరింత ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా శానిటైజర్ల వలె హాని కలిగించవు. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు