Weight loss Tips: వేగంగా బరువు తగ్గించుకోవాలంటే..ఈ టీ నెలరోజులు తాగితే చాలు

Weight loss Tips: స్థూలకాయం ఇటీవలికాలంలో ప్రధాన సమస్యగా మారింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆధునిక జీవనశైలి సమస్యే. పనివేళలు, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వంటివి స్థూలాకాయానికి దారితీస్తుంటాయి. ఇటీవలి కాలంలో చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2023, 08:25 PM IST
Weight loss Tips: వేగంగా బరువు తగ్గించుకోవాలంటే..ఈ టీ నెలరోజులు తాగితే చాలు

Weight loss Tips: రోజురోజుకూ పెరుగుతున్న బరువు ప్రతి ఒక్కరికీ సమస్యగా మారిపోయింది. నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యల్ని కూడా కొనితెచ్చుకోవల్సివస్తుంది. అయితే కొన్ని పద్ధతులు క్రమం తప్పకుండా పాటిస్తే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు పుదీనా టీ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే పోషక పదార్ధాలతో చాలా సమస్యలను తగ్గించవచ్చు. పసుపు-పుదీనా టీ తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. పసుపు-పుదీనా టీ శరీరంలో ఉండే కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మరోవైపు నిద్రేలేమి సమస్యను దూరం చేసేందుకు పుదీనా పసుపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనా-పసుపు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఈ టీ తాగడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. నిద్రలేమి సమస్య దూరమౌతుంది.

ఇమ్యూనిటీ బూస్ట్

పసుపు-పుదీనా టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తాయి. దీంతో తలనొప్పి, జలుబు వంటి సీజనల్ సమస్యలు దూరమౌతాయి. పుదీనా-పసుపు టీ తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్ సమస్య కూడా దూరమౌతుంది. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు పసుపు-పుదీనా టీ తాగేవారు. 

శ్వాస నుంచి వచ్చే చెడు వాసనను దూరం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పుదీనా-పసుపు టీ బాగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల చాలాసేపటి వరకూ నోట్లో ఫ్రెష్ నెస్ ఉంటుంది. అందుకే నోటి చెడు వాసనను దూరం చేసేందుకు చాలామంది పుదీనా-పసుపు టీ తాగమని సలహా ఇస్తుంటారు. పుదీనా పసుపు టీ క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే కేవలం 5-6 వారాల్లో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ శరీర బరువు గణనీయంగా తగ్గడం గమనించవచ్చు.

Also read: Fatty Liver: ఈ అలవాట్లు మానుకుంటే..ప్రాణాంతక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News