Super Drinks for Weight Loss: బెల్లీ ఫ్యాట్ తగ్గి.. సన్నని నాజూకు లాంటి నడుము కోసం ఈ డ్రింక్స్ తాగండి చాలు

Super Drinks for Weight Loss: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఇది అసాధ్యమైంది కానే కాదు. డైట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే సాద్యమౌతుంది. ముఖ్యంగా కొన్ని రకాల డ్రింక్స్ తాగడం ద్వారా స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2023, 04:53 PM IST
Super Drinks for Weight Loss: బెల్లీ ఫ్యాట్ తగ్గి.. సన్నని నాజూకు లాంటి నడుము కోసం ఈ డ్రింక్స్ తాగండి చాలు

Home Made Weight Loss Drinks: స్థూలకాయం లేదా అధిక బరువు అందర్నీ ప్రధానంగా వేధిస్తోంది. దీనికోసం గంటల తరబడి జిమ్‌లో గడిపినా వాకింగ్, డైటింగ్ చేసినా ప్రయోజనం కన్పించదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని డ్రింక్స్ తీసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చాలా సులభంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రింక్స్ కారణంగా శరీరం మెటబోలిజం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంటుంది. సన్నటి నడుము కావాలంటే ఎలాంటి డ్రింక్స్ తాగాలో తెలుసుకుందాం..

జీలకర్ర నీరు

జీలకర్ర నీరు శరీరానికి చాలా ప్రయోజనకరం. ఇది తాగడం వల్ల నడుము సన్నగా మారుతుంది. బరువు వేగంగా తగ్గుతుంది. ఇది తయారు చేసేందుకు ఒక స్పూన్ జీలకర్రను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం ఈ నీళ్లను 5 నిమిషాలు ఉడికించాలి. దీన్ని వడకాచి తాగాలి. ఈ నీళ్లు మీ నడుము సైజ్ తగ్గించేందుకు దోహదపడుతుంది. మీ బరువు కూడా వేగంగా తగ్గుతుంది. ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. 

సోంపు నీరు

సోంపు నీరు తాగడం శరీరానికి ప్రయోజనకరం. ఈ నీరు తాగడం వల్ల శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. దీనివల్ల శరీరం బరువు వేగంగా తగ్గుతుంది. ఒక స్పూన్ సోంపును నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచాక 5 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడకాచి తాగాలి. 

నిమ్మరసం

నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. ఇది జీర్ణక్రియను పటిష్టం చేస్తుంది. బరువు తగ్గుతుంది. నిమ్మరసాన్ని చల్లని నీళ్లలోకాకుండా గోరువెచ్చని నీళ్లలో కలపాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది.

Also read: Woman Health Tips: పీరియడ్స్ సమయంలో సమస్యలు ఎలా దూరమౌతాయి, బొప్పాయి తినడం మంచిదా కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News