Walnuts For Diabetes: ప్రస్తుతం చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరైతే పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఆహారంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్ గా చేయడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా అన్ని డ్రై ఫ్రూట్స్ లో కంటే వాల్నట్స్ శరీరానికి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చూడడానికి మనిషి మెదడు లాంటి ఆకారంలో ఉన్నప్పటికీ దీనిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం చాలామంది డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా నీటిలో నానబెట్టి తింటున్నారు.. ఇలా తినడం వల్ల కొన్ని శరీరానికి మంచి ప్రయోజనాలు కలిగించినప్పటికీ మరికొన్ని మాత్రం తీవ్ర దుష్ప్రభావాలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వాల్నట్స్ను ఎలా తింటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్నట్స్‌లో శరీరానికి కావాల్సిన ఈ పోషకాలు లభిస్తాయి:
వాల్ నట్స్ లో శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది.
వాళ్లకు నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మలబద్ధకం సమస్య:
విచ్చలవిడిగా బయట లభించే ఆహారాలను అతిగా తినడం వల్ల అందరిలో మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు నీటిలో నానబెట్టిన వాల్నట్స్ను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
బ్లడ్ లో షుగర్ లెవెల్ సదుపులో ఉంటాయి:
డయాబెటిస్తో బాధపడుతున్న వారు తప్పకుండా వారి శరీరంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మధుమేహం కొంతమందిలో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలున్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకునేందుకు తప్పకుండా వాల్ నట్స్ను ప్రతిరోజు నీటిలో నానబెట్టి ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపదానం పొందడానికి వాల్నట్స్ను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేర్చుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe