Best Food for Diabetes: మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్ ఇదే, బ్లడ్ షుగర్ మటుమాయం

Best Food for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పు , నియంత్రణతోనే మధుమేహాన్ని సమర్ధవంతంగా అదుపు చేయవచ్చు. ఈ క్రమంలో ఏ చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2024, 07:31 PM IST
Best Food for Diabetes: మధుమేహం రోగులకు బెస్ట్ ఫుడ్ ఇదే, బ్లడ్ షుగర్ మటుమాయం

Best Food for Diabetes: డయాబెటిస్ రోగులకు ముఖ్యంగా కావల్సింది హెల్తీ డైట్. అంటే ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా మినపప్పు ఇందుకు అద్భుతంగా పనిచేస్తుందంటారు. 

ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జెనెటిక్ కారణాలు అన్నీ కలిపి డయాబెటిస్ వ్యాధిని పెంచుతున్నాయి. జెనెటిక్ కంటే లైఫ్‌స్టైల్ ప్రధాన కారణంగా కన్పిస్తోంది. అందుకే డయాబెటిస్ ఉన్నప్పుడు ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లలో మార్పు. అంటే హెల్తీ డైట్ చాలా అవసరం. దీనికోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమని సూచిస్తుంటారు. నూనె అధికంగా వాడే అవకాశమున్నందున చికెన్, చేపలు, మటన్ తగ్గించాల్సి ఉంటుంది. బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేంది మినపప్పు. అందుకే న్యూట్రిషనిస్టులు కూడా మినపప్పు అధికంగా తీసుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, ఐరన, ఫోలేట్, కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. డయాబెటిస్ రోగులకే కాదు అందరికీ ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. ఇందులో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

మినపపప్పులో 2 రకాలుంటాయి. తొక్కతో ఉన్నవి తింటే మరింత ప్రయోజనకరం. ఇందులో ప్రోటీన్లతో పాటు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. బ్యాలెన్స్ డైట్, ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర సంగ్రహణను నెమ్మదించేలా చేస్తుంది. 

మినపప్పును కూడా ఇతర పప్ప్పులు వండినట్టే వండాలి. ఇందులో నీళ్లు , కాస్త ఉప్పు, పసుపు కలపాలి. పప్పు తాలింపు అవసరం లేదు. నూనె తక్కువగా వాడాలి. 

Also read: Vitamin B12 importance: తరచూ అలసటగా ఉంటుందా, అశ్రద్ధ చేస్తే ప్రమాదకరం కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News