Unusual Diabetes Symptoms: మీరు నమ్మలేరు.. ఈ 8 కూడా డయాబెటిస్ లక్షణాలేనట..

Unusual Diabetes Symptoms: సాధారణంగా డయాబెటిస్‌ అంటేనే సైలంట్‌ కిల్లర్ అంటారు. ఇది మొదలై కొన్ని లక్షణాలు కనిపించేంత వరకు మనకు తెలీదు. కానీ, కొన్ని లక్షణాలను మాత్రం ఏ విధంగా కనిపెట్టలేమట. అవేంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : May 3, 2024, 09:16 PM IST
Unusual Diabetes Symptoms: మీరు నమ్మలేరు.. ఈ 8 కూడా డయాబెటిస్ లక్షణాలేనట..

Unusual Diabetes Symptoms: సాధారణంగా డయాబెటిస్‌ అంటేనే సైలంట్‌ కిల్లర్ అంటారు. ఇది మొదలై కొన్ని లక్షణాలు కనిపించేంత వరకు మనకు తెలీదు. కానీ, కొన్ని లక్షణాలను మాత్రం ఏ విధంగా కనిపెట్టలేమట. అవేంటో తెలుసుకుందాం.

చర్మరంగు..
డయాబెటిస్‌ వచ్చినప్పుడు స్కిన్‌ రంగు కూడా పేలవంగా మారిపోతుంది. చర్మంపై నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. మెడ ప్రాంతంలో చర్మం ముడతలు ఎక్కువగా పడుతుంది.

తరచూ ఇన్ఫెక్షన్స్‌..
డయాబెటిస్‌తో బాధపడేవారు తరచూ ఇన్పెక్షన్ల బారినపడే అవకాశం ఉంటుంది. హై బ్లడ్ షుగర్‌ ఉన్నవారి ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది.  వీరికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఈస్ట్, స్కిన్‌ ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడతారట.

పీరియాడన్‌టిటైస్..
ఇది ఓ ప్రాణాంతక గమ్ డిసీజ్. చిగుళ్ల నుంచి పళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. ఈ లక్షణం కూడా చాలామందిలో మీరు గమనించి ఉంటారు. పంటి నుంచి రక్తం కూడా కారుతుంది. పంటి చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలి.

ఇదీ చదవండి: బెల్‌ పెప్పర్స్‌ తింటున్నారా? లేకపోతే ఈ 6 ప్రయోజనాలు మిస్సయినట్లే..
కంటిచూపు..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కంటి చూపు కూడా మందగిస్తుంది. హఠాత్తుగా కంటి చూపు మందగిస్తుంది.ఇది కూడా డయాబెటిస్‌ లక్షణమే. ఇలా జరిగితే వెంటనే వైద్యులను సందర్శంచి హెల్త్‌ చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

వినికిడిలోపం..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చెవిలోపలి రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీని వల్ల వినికిడి లోపం కూడా ఏర్పడుతుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

పక్కతడపడం..
డయాబెటిస్‌ అనేది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ వస్తోంది. పిల్లల్లో ఈ వ్యాధి వస్తే పక్క కూడా తడుపుతారు. రక్తంలో చక్కెర అతిగా పెరగడం వల్ల ఇలా యూరీన్ వెళ్తారు.

మూడ్‌ ..
డయాబెటిస్‌ ఉన్నవారు మూడ్, మెంటల్‌గా కూడా మార్పులు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు మూడ్‌ స్వింగ్‌, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వస్తుంది.

ఇదీ చదవండి: క్యాబేజీ తినేవారికి ఈ అనారోగ్య  సమస్యలే దరిచేరవట..

తిమ్మిర్లు..
డయాబెటిస్ ఉన్నవారికి తిమ్మర్లి కూడా వస్తాయి. రానురాను స్పర్శ కూడా తగ్గిపోతుంది. ఇది కాళ్లు, చేతుల్లో కూడా కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News