Health Benefits of Sweet Potato: మనలో చాలామందికి గడ్డ కూరలు అంటే ఇష్టం.. మరి కొంతమందికి గడ్డ కూరలు అస్సలు పడవు. అట్లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇష్టంగా తినేది స్వీట్ పొటాటో. సహజంగా ఎంతో తియ్యగా ఉండే స్వీట్ పొటాటో దుంప జాతికి చెందినది. దీన్ని కొందరు ఉడికించుకొని తింటే మరికొందరు చక్కగా కూరలు చేసుకుంటారు. ఎలా తిన్నా దీని రుచి అమోఘంగా ఉంటుంది. అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
స్వీట్ పొటాటోలు అధిక శాతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు దీన్ని సాయంత్రం పూట అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు కూడా కరుగుతుంది. ఇందులో అధిక మోతాదులో విటమిన్ బి 6 , పొటాషియం ఉంటుంది కాబట్టి గుండెపోటు ప్రమాదాన్ని ఇది ఎక్కువగా తగ్గిస్తుంది. ఇక ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎముకల..దంతాల దృఢత్వానికి ,ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆడవారిలో క్యాల్షియం కంటెంట్ బాగా తగ్గుతుంది దీని ప్రభావం నేరుగా వాళ్ళ ఎముకలపై పడుతుంది. అలాంటివారు తప్పకుండా ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోస్ బాగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళ శరీరం కోల్పోయిన క్యాల్షియం కంటెంట్ కొంతైనా తిరిగి పొందగలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. స్వీట్ పొటాటో స్మూతీస్ ..ఇంకా సూప్స్ కూడా చేసుకొని తాగవచ్చు.
మూత్రపిండాల సమస్యలకు ,కండరాల వాపులు.. తిమ్మిర్లు వంటి వాటికి కూడా చిలగడ దుంప మంచి మందుగా పని చేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్ దీని కూడా అందిస్తుంది. స్వీట్ పొటాటో మన శరీరంలో ఎర్ర ,తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంపొందించి డిప్రెషన్ను బాగా తగ్గిస్తుంది. స్వీట్ పొటాటో రెగ్యులర్. గా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్ లు శరీరంలో వృద్ధి చెందకుండా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ చల్లని చలికాలంలో వేడి ..వేడి చిలకడదుంపలు ఆస్వాదించండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి