Turmeric Side Effects: ఈ సమస్యలున్నవాళ్లు పసుపు వాడితే ఏమౌతుంది, మంచిదా కాదా

Turmeric Side Effects: ఆయుర్వేదంలో పసుపుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పసుపును దివ్య ఔషధంగా పరిగణిస్తారు. పసుపు కేవలం వంటలకే కాదు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పరిమితి దాటితే పసుపు కూడా హానికారకమని ఎంతమందికి తెలుసు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2024, 05:28 PM IST
Turmeric Side Effects: ఈ సమస్యలున్నవాళ్లు పసుపు వాడితే ఏమౌతుంది, మంచిదా కాదా

Turmeric Side Effects: ప్రతి భారతీయ కిచెన్‌లో తప్పకుండా ఉండే వివిధ రకాల పదార్ధాల్లో పసుపు ఒకటి. సాధారణంగా పసుపును వంటల్లో ఉపయోగిస్తుంటారు. అటు చర్మ సంరక్షణకు కూడా పసుపు వినియోగం అనాదిగా వస్తున్నదే. అందుకే పసుపును బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో అధికంగా ఉపయోగిస్తారు. అయితే పసుపుతో ప్రయోజనాలతో పాటు దుష్పరిణామాలు కూడా ఉంటుంటాయి. అవేంటో పరిశీలిద్దాం.

పసుపులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కేలరీలు, ఫ్యాట్, కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం, ఐరన్ , థయామిన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలున్నాయనే కారణంగా పొరపాటున కూడా పసుపు అథికంగా వాడకూడదు. మితంగానే వాడాలి. లేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. పసుపుతో ఎలర్జీ ఉండవచ్చు. అందుకే పసుపు అమితంగా వాడితే ఎలర్జిక్ రియాక్షన్ పెరగవచ్చు. స్కిన్ సెన్సిటివ్ ఉండేవాళ్లు పసుపు వాడేముందు వైద్యుని సంప్రదించాలి.

కడుపు సమస్యలతో బాధపడేవాళ్లు పసుపు మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా కడుపులో మంట, అజీర్తి, నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కడుపు సంబంధిత సమస్యలున్నవాళ్లు పసుపు మితంగానే తీసుకోవాలి. పసుపును చర్మ సంరక్షణలో అనాదిగా వాడుతున్నారు. పరిమితి దాటి వాడితే మాత్రం చర్మానికి హాని కలగవచ్చు. ఎందుకంటే చర్మంలోని బ్లడ్ సెల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా దురద వంటి సమస్యలు రావచ్చు.

పసుపు రక్త ప్రసరణను పెంచుతుంది. అందుకే బ్లీడింగ్ సమస్య ఉన్నవాళ్లకు పసుపు మంచిది కాదగు. ముఖ్యంగా రక్తం పల్చగా ఉండేవారు పసుపుకు దూరంగా ఉండాలి. లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి.

Also read: Cinnamon Water Benefits: రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే ఏం జరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News