Weight Loss Without Diet: క్రమశిక్షణకు ,టెక్నాలజీకే కాదు ..ఆరోగ్యానికి కూడా బాగా ప్రసిద్ధి చెందిన దేశం జపాన్. వాళ్లు పాటించే ఎన్నో ఆహారపు అలవాట్ల కారణంగా చాలా వరకు వయసు పైపడిన ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అందుకే జపనీస్ ఫాలో అయ్యే ఎన్నో పద్ధతులను.. ఆరోగ్య సూత్రాలను చాలాదేశాలు ఆచరించడానికి ప్రయత్నిస్తాయి. వాటిలో ప్రముఖంగా ఆదరణ పొందినది జపనీస్ వాటర్ థెరపీ.
వినడానికి వింతగా ఉన్న.. ఈ వాటర్ తెరఫీ కారణంగా మన శరీరంలో ఎన్నో రకాల రోగాలను తగ్గించే ఆస్కారం ఉంది. మన శరీర నిర్మాణం 60 శాతం నీటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మన శరీరానికి నీరు ఎంతో అవసరం. అయితే ఆ నీటిని మనం సరియైన పద్ధతిలో తీసుకుంటేనే దానివల్ల ప్రయోజనాలు కలుగుతాయి. మరి నీటి ద్వారా శరీరాన్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచడానికి జపనీస్ ఫాలో అయ్యే ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకుందాం పదండి..
రోజు పొద్దున నిద్ర లేవగానే ఖచ్చితంగా మంచినీరు తీసుకోవాలి. నిద్రలేచిన వెంటనే జపనీయులు కనీసం నాలుగు నుంచి ఆరు గ్లాసుల వరకు మీరు నిదానంగా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అని వారు భావిస్తారు. అయితే మంచినీరు తీసుకున్న 45 నిమిషాల పాటు మరి ఇంకెటువంటి ఆహారం ముట్టుకోరు. ఇలా చేయడం వల్ల మన శరీరం పోషకాలను సరైన మోతాదులో సమర్థవంతంగా గ్రహించగలదు అని వారు భావిస్తారు.
అలాగే తీసుకునే ఆహారాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా నమిలి తింటారు. భోజనం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా నీరు తీసుకోరు.తింటూ నీళ్లు తాగడం చాలామందికి అలవాటు.. అయితే అలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఊబకాయం తగ్గించుకోవాలి అనుకునేవారు కచ్చితంగా తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఇలా తినడం వల్ల గ్యాస్ ,కడుపుబ్బరం లాంటి సమస్యలు కూడా రావు.
అయితే మంచిది కదా అని విపరీతంగా మీరు తీసుకున్న దుష్ప్రయోజనాలు తప్పవు. సరైన మోతాదులు ఎప్పుడు ఎలా తీసుకోవాలి నీటిని జాగ్రత్తగా అలాగే తీసుకోవడం వల్ల ఫలితాలను అందుకోగలుగుతాము. చాలామంది భోజనం చేసేటప్పుడు కూల్ వాటర్ తాగుతారు.. దీనివల్ల శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువ అవుతాయి. అదే గోరువెచ్చని నీరు తీసుకుంటూ ఉండటం వల్ల పేగులు శుభ్రపడడంతో పాటు జీవక్రియ మెరుగుగా జరుగుతుంది. సన్నబడాలి అనుకునేవారు రోజుల్లో ఎక్కువ గోరువెచ్చటి నీరు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనలు మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించండి.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook