Panic Attack: ప్యానిక్‌ అటాక్‌ అయిందా? ఈ 8 చిట్కాలు ట్రై చేసి చూడండి..

Panic Attack Remedies:  ప్యాన్‌ అటాక్‌ను వెంటనే గుర్తించాలి. దీంతో పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావచ్చు.  సమస్య తెలిస్తే భయాందోళనకు గురవ్వకుండా ఉంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Aug 1, 2024, 04:01 PM IST
Panic Attack: ప్యానిక్‌ అటాక్‌ అయిందా? ఈ 8 చిట్కాలు ట్రై చేసి చూడండి..

Panic Attack Remedies: ప్యానిక్‌ అటాక్‌ అంటే యాంగ్జైటీ, ఆందోళనకు దారితీస్తుంది. ప్యానిక్‌ అటాక్‌ అవుతే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందది, తలతిరగడం, హార్ట్‌బీట్‌లో మార్పులు, కండరాలు అదరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కొన్ని నిమిషాలపాటు ఉంటుంది. ఒక్కోసారి కొన్ని గంటలు కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. కొన్ని చిట్కాలు పాటిస్తే ప్యానిక్‌ అటాక్‌ తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

శ్వాస..
ప్యానిక్‌ అటాక్ అయినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముక్కు ద్వారా డీప్‌ బ్రీత్‌ తీసుకోవాలి. గాలి కొంత సమయంపాటు పీల్చుకుని ఆ తర్వాత వదలాలి. ఇలా బ్రీత్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీంతో నరాల వ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది.

అటాక్‌ను వెంటనే గుర్తించండి..
ప్యాన్‌ అటాక్‌ను వెంటనే గుర్తించాలి. దీంతో పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావచ్చు.  సమస్య తెలిస్తే భయాందోళనకు గురవ్వకుండా ఉంటారు.

ఫోకస్‌..
ప్యానిక్‌ అటాక్‌ అయిన వెంటనే ఏదైనా ఒక వస్తువు తీసుకుని దాని గురించి ప్రతీది రాయడం మొదలుపెట్టండి. దీంతో మీ ఫోకస్‌ కాస్త అటాక్‌ పైనుంచి మళ్లుతుంది. ఎందుకంటే ప్యానిక్‌ అటాక్‌ మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆలోచనలోకి వెళ్లకుండా ఏదైనా వస్తువుపై ఫోకస్‌ చేస్తే ఆందోళన నుంచి మీరు త్వరగా బయటపడతారు.

కండరాల ఉపశమనం..
ప్యానిక్ అటాక్ జరిగితే కండరాలపై ప్రభావం పడుతుంది. అందుకే కండరాలకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు చేయాలి. దీనివల్ల టెన్షన్‌ తగ్గిపోయి, రిలాక్స్‌ అవుతారు. ఈ కండరాలకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు చేస్తే ప్రభావం కూడా తగ్గుతుంది.

స్థలం..
అంతేకాదు ప్యానిక్‌ అటాక్‌ జరిగినప్పుడు ఒక ప్రదేశంలోనే ఉండాలి. అక్కడి నుంచి వేరే స్థలంలోకి వెళ్తే ప్యానిక్‌ అటాక్ ఎక్కువ అవుతుంది. ముందుగా పరిస్థితిని మీ అదుపులో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్తే పరిస్థితులు దిగజారిపోతుంది. అందుకే ప్యానక్‌ అటాక్‌ అయినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..

ఎక్సర్‌సైజ్‌..
ప్యానిక్‌ అటాక్‌ జరిగినప్పుడు చిన్న పాటి ఎక్సర్‌సైజులు చేయాలి. ఇది ఎండార్ఫీన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది మీ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల ప్యానిక్‌ అటాక్‌ పరిస్థితి దారుణంగా మారకుండా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామాం చేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. 

కెఫీన్‌..
కెఫీన్, ఆల్కహాల్‌ అతిగా తీసుకోకుండా ఉండాలి. కెఫీన్‌, ఆల్కహాల్‌ తగ్గిస్తే ప్యానిక్‌ అటాక్‌ పరిస్థితులు దారుణంగా కాకుండా ఉంటాయి. ముఖ్యంగా హెర్బల్‌ టీ, నీరు తీసుకోవచ్చు. దీనివల్ల కూడా ప్యానిక్ అటాక్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News