ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!

ఎంత చెప్పినా వినకుండా ఉప్పు అధికంగా తీసుకుంటారు. అయితే అధిక మోతాదులో ఉప్పు తినడం కారణంగా మీ శరీరం రోగ నిరోధకశక్తి తగ్గుతుంది.

Last Updated : Mar 31, 2020, 03:35 PM IST
ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!

కొందరు ఎంత చెప్పినా వినకుండా ఉప్పు అధికంగా తీసుకుంటారు. అయితే అధిక మోతాదులో ఉప్పు తినడం కారణంగా మీ శరీరం రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. బ్యాక్టీరియా, లేక ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడితే శరీరం ఎదుర్కోలేదని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ అనే జర్నల్‌లో మరెన్నో ఆసక్తికర విషయాలు ప్రచురించారు. బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి

రోజుకు 5గ్రాముల ఉప్పు మాత్రమే ఆహారంలో తీసుకోవాలని అంతకు మించి తినడం శ్రేయస్కరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తరచుగా చెబతోంది. రోజుకూ అదనంగా 6 గ్రాముల ఉప్పు తీసుకన్నట్లయితే అది రెండు ఫాస్ట్ ఫుడ్ ప్లేట్‌లో వాడే ఉప్పుకు సమానమని  ఆశ్చర్యకర విషయాలు అధ్యయనంలో గుర్తించారు. జర్మనీకి చెందిన బాన్ యూనివర్సిటీ రీసెర్చర్ క్రిస్టియన్ కర్ట్స్ ఈ అధ్యయనం చేశారు.  NAP: మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? ఏం చేస్తే బెటర్

ఎలుకలపై ఈ రీసెర్చ్ జరిగింది. కొన్ని ఎలుకలకు అధిక మోతాదులో ఉప్పు కలిగిన ఆహారాన్ని ఇవ్వడంతో కొన్ని రోజుల తర్వాత లిస్టేరియా ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోయాయని గుర్తించారు. తరచుగా జ్వరం వచ్చే లక్షణాలు కనిపించాయని రీసెర్చ్‌లో తేలింది. ఇదే విధంగా మనుషులకు సైతం అధికంగా సోడియం క్లోరైడ్ (ఉప్పు) ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని చెప్పారు. నిత్యం తీసుకునే మోతాదు కంటే అధికంగా 6గ్రాముల ఉప్పును కొందరికి ఆహారంలో ఇచ్చి పరీక్షించారు. రెండు ఫాస్ట్ ఫుడ్‌లలో ఇదే మోతాదు ఉప్పు ఉంటుందని కర్ట్స్ తెలిపారు. మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వారం తర్వాత గ్రాన్యులోసైట్స్‌ను పరీక్షించారు. రోగ నిరోధకశక్తిని పెంచే కణాలను బ్యాక్టీరియాలు దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. అధిక మోతాదులో ఉప్పు తీసుకుంటే గ్లూకోకార్టికోయిడ్ స్థాయి పెరుగుతుంది. సాధారణంగా గ్లూకోకార్టికోయిడ్ కార్టిసోన్‌ను మంటల్ని అదుపు చేయడంలో వాడతారని తెలిసిందే. ఉప్పు అధికంగా తినడం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గడంతో పాటు ఏదైనా చర్యలకు వేగంగా స్పందించడం లాంటి సమస్యలు తలెత్తుతాయని రీసెర్చర్ క్రిస్టియన్ కర్ట్స్ వివరించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తామంటే!

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

Trending News