Acidity Remedies: ఆసిడిటి సమస్యకు ఎలాంటి ఖర్చు లేకుండా 2 నిమిషాల్లో చెక్‌ పెట్టండి ఇలా!

Remedies For Acidity: ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే  సమస్యలో ఆసిడిటి ఒకటి.  దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా  కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 11:10 AM IST
Acidity Remedies: ఆసిడిటి సమస్యకు ఎలాంటి ఖర్చు లేకుండా 2 నిమిషాల్లో చెక్‌ పెట్టండి ఇలా!

Remedies For Acidity: సాధారణంగా యాసిడ్‌ రిఫ్లక్స్‌, గుండెల్లో అధిక మంటతో చాలా మంది బాధపడుతుంటారు. దీని కోసం ఆంటాసిడ్‌ సిరప్‌లు, మందలు, పానీయాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మందులు కారణంగా కొంత ఉపశమనం పొందుతారు కానీ సమస్య తగ్గదు.  అయితే ఆరోగ్యనిపుణులు ప్రకారం ఎలాంటి మందులు, పానీయాలు వాడకుండా కూడా ఈ ఆసిడిటిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే దీని కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు  కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. 

కడుపులో ఆసిడ్‌ ఎక్కువగా ఉత్పత్తి జరిగినప్పుడు ఆసిడిటి సమస్య మొదలవుతుంది. దీని కారణంగా గుండెల్లో మంట లేద ఛాతీలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.  ఆసిడిటికి కేవలం ఆసిడ్‌ ఉత్పత్తి మాత్రమే కాకుండా కొన్ని రకలా మసాలా ఆహారాలు తీసుకోవడం, అతిగా తినడం, తిన్నవెంటనే పడుకోవడం వల్ల ఈ ఆసిడిటీ సమస్య తలెత్తుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ     ఆసిడిటి సమస్య నుంచి బయటపడవచ్చు. 

ఆసిడిటికి ప్రధాన కారణాలు: 

ఆసిడిటికి ప్రధాన కారణం మనం తీసుకోనే ఆహార పదార్థాలు. ఎక్కువ పుల్లటి పండ్లు, కార్బోనేటెడ్‌ జ్యూస్‌లు, బర్గర్, పిజ్జా, టామాటా సాస్,  ఉప్పుకారాలు వంటి ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి ఈ పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. 

తిన్నవేంటనే చాలా మంది పడుకోవడం, కూర్చోడం వంటి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయడం తగ్గించాలని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. 

మీ రాత్రి భోజనం, నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉండాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినేయకుండా పొట్టలో కొంత ఖాళీ ఉండేలా  చూసుకోవాలి.

అలాగే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు కార్బోనేటేడ్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది ఇంకా ఆసిడిటిని పెంచుతుంది. 

శరీరానికి  రోజుకి ఐదు లీటర్ల నీరు తాగాలి ఇలా చేయడం వల్ల వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.

Also read: Healthy Kidneys: ఎక్కువగా నీరు తాగుతే కిడ్నీలపై ఎఫెక్ట్‌ పడుతుందా?

అధిక బరువు ఉండటం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అనేది  గుండెల్లో మంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక బరవు పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలని నిపుణలు చెబుతున్నారు. 

సిగరెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అసిడిటి సమస్య బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ధూమపానం చేసేవారికి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also read: Green chickpeas Health benefits: చలికాలంలో ప్రతిరోజూ 100 గ్రాముల పచ్చి బఠాణీలు తింటే ఈ 5 లాభాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News