నేటి జీవన విధానంలో ( Lifestyle ) ఏ వ్యాధి ఎప్పుడు మిమ్మల్ని తమ వశపరుచుకుంటుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా దగ్గు ( Cough ), జలుబు ( Cold ), జ్వరం ( Fever ) చాలా మందిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే దగ్గు అనేది ఎంత ప్రమాదకరమైన సమస్య అంటే అది ఒక్కసారి వస్తే అది వెంటనే తగ్గదు. అయితే పొడిదగ్గు వల్ల ఇబ్బంది పడే వాళ్లు అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.
గుడ్ న్యూస్ ఏంటంటే పొడి దగ్గును ఇంటి చిట్కాలు పాటించి తగ్గించే అవకాశం ఉంది ( Remedies for Dry Cough).ఈ రోజు మీకు పొడిదగ్గు నుంచి విముక్తి కలిగించే ఇంటి చిట్కాలను తెలియజేస్తాం. వాటిని పాటించి రిలీఫ్ అవ్వవచ్చు (Relief from dry cough).
పొడిదగ్గు లక్షణాలు (Dry Cough Symptoms):
పొడిదగ్గులో తెమడ తెగిరాదు. గొంతులోని ఉండిపోతుంది. చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతు నొప్పి కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో దీని వల్ల ముక్కు సంబంధిత ఎలర్జీలు, ఆసిడిటి, ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రాక్టివ్ పల్మనరీ డిజార్డర్ ( COPD) లేదా ట్యూబర్ క్లాసిక్స్ ( TB) కూడా సోకే అవకాశం ఉంది. అందుకే ఎవరికైనా చాలా కాలం నుంచి దగ్గుతో బాధపడుతూ ఉంటే వారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఇలా చేసి చూడండి
- తేనె, అల్లం అనేది ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉంటుంది. ఈ రెండూ మీ ఆరోగ్యానికి (Health ) చాలా మంచివి. రెంటింటిలోనూ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంటో పాటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో కూడా ముందుంటాయి.
- మీరు చేయాల్సిదల్లా ఒక చెంచా తేనెలో కాస్త అల్లం రసం కలిపి దాన్ని సేవించండి.
- తరువాత చిన్న ములైతీ ( Liquorice ) కాడను పిప్పరమెంట్ లా నోట్లో ఉంచండి. దీని వల్ల మీ గొంతు ఎండదు. గొంతు ఎండిపోవడం తగ్గుతుంది.
( గమనిక: ఈ చిట్కాలు పాటిండానికి ముందు వైద్యుడిని సంప్రదించగలరు )