ఇండియాలో అత్యంత ఇష్టమైన పానీయం టీ మాత్రమే. అత్యధికులు మిల్క్ టీనే ఇష్టపడతారు. కానీ మిల్క్ టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
ప్రతిరోజూ ఉదయం లేవగానే చాలామందికి టీ తాగడం అలవాటు. అది కూడా మిల్క్ టీ. ఇది ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి అంతే హానికరం కూడా. మిల్క్ టీలో ఉండే టైనిన్ అనే పదార్ధం అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే మిల్క్ టీతో కలిగే సమస్యలేంటనేది తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మిల్క్ టీతో 5 సమస్యలున్నాయి.
1. మిల్క్ టీ తాగడం వల్ల ఛాతీలో మంట ప్రారంభమౌతుంది. టీలో ఉండే కెఫీన్ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. అటు ఛాతీలో కూడా మంట మొదలవుతుంది. గ్యాస్ కారణంగా నడుము నొప్పి సమస్యగా మారుతుంది.
2. మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపుపై దుష్ప్రభావం పడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. మిల్క్ టీ తాగడం వల్ల పళ్లలో సమస్య ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల పళ్లకుండే ఎనామిల్ పాడవుతుంది. పళ్లను బలహీనం చేస్తుంది.
4. మిల్క్ టీ తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. ఇందులో ఉండే టైనిన్...కాల్షియంను గ్రహించుకుని ఎముకల్ని బలహీనం చేస్తుంది.
5. మిల్క్ టీ ఎక్కువగా తీసుకుంటే..నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. టీలో ఉండే కెఫీన్ నిద్ర రానివ్వకుండా చేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తికి ఒత్తిడి, కంటి కింద డార్క్ సర్కిల్స్ పెరుగుతాయి.
Also read: Back Pain Relief: ఈ చిట్కాలతో బ్యాక్ పెయిన్ సమస్యకు క్షణాల్లో ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook