Skin Care Tips: పుచ్చకాయతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతం! ఇలా చేయండి

Skin Care By Watermelon: పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజలున్నాయో... దానిని ముఖానికి రాసుకోవడం వల్ల కూడా అన్నే ఉపయోగాలు ఉన్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 04:26 PM IST
Skin Care Tips: పుచ్చకాయతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతం! ఇలా చేయండి

Skin Care By Watermelon: ప్రతి ఒక్కరూ మెరిసే చర్మాన్ని (Glowing skin) కోరుకుంటారు. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. మన ముఖంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఫేస్ పై మచ్చలు, మెటిములు, చర్మ పొడి బారడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిన్నింటికి చెక్ పెట్టాలంటే.. పుచ్చకాయ ఫేషియల్ (Watermelon Facial) మీ ముఖానికి అప్లై చేయండి. దీని వల్ల మీ ముఖం మెరుస్తుంది. పుచ్చకాయను తినడంతోపాటు ఫేస్ కు రాసుకోవడం వల్ల కూడా బోలేడు ప్రయోజనాలున్నాయి. మీరు వేసవిలో పార్లర్‌కు వెళ్లలేకపోతే.. పుచ్చకాయతో ఫేషియల్ చేసుకోండి. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

పుచ్చకాయ ఫేషియల్ ఎలా చేయాలంటే..
**ముందుగా పుచ్చకాయ రసంలో కొబ్బరి నూనె వేసి.. ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. 
**దీని తర్వాత మీరు పుచ్చకాయ స్క్రబ్ సిద్ధం చేసుకోవాలి. అందుకోసం 2 టీస్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టీస్పూన్ బియ్యపు పొడి కలపాలి. దీనితో మీరు మీ ముఖాన్ని స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది మీ ముఖం నుండి డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది.
**ఇప్పుడు మీరు పుచ్చకాయ యొక్క క్రీమ్ తయారు చేయాలి. అందుకు మీరు 1 టీస్పూన్ పుచ్చకాయ రసంలో తేనె మరియు కొద్దిగా నిమ్మరసం కలపాలి. వాటిని కలపడం ద్వారా మీ క్రీమ్ సిద్దమవుతోంది. దీన్ని ముఖానికి పట్టించాలి.
**ఇప్పుడు పుచ్చకాయ ఫేస్ మాస్క్ తయారు చేసే సమయం వచ్చింది. ఇందుకోసం శనగపిండి, పాలు, పుచ్చకాయ రసం తీసుకోవాలి. వీటిని మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి.
** ఇలా మీ ముఖంపై 15 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగండి.
**ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మెరుస్తుంది. 

Also Read: Spices To Avoid In Summer: ఎండా కాలంలో ఈ 5 మసాలాలు తినకుండా ఉంటే మంచిది! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News