Fungal Infections: వర్షాకాలం వస్తే ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో..కాలి వేళ్లలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో చర్మ సంరక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా కాళ్ల విషయంలో చాలా జాగ్ర్తత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో కాళ్లకు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షం నీళ్ళు లేదా బురద నీళ్లలో మనకు తెలియకుండానే కాళ్లు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతాయి. ఫలితంగా కాళ్లలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్య అధికమౌతుంది. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉప్పు ఉపయోగపడుతుంది. కాళ్లకు ఏ విధమైన ఇన్‌ఫెక్షన్ సోకకుండా కాపాడుకునేందుకు ఒక టబ్ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఆ నీళ్లలో మీ కాళ్లు పెట్టుకుని దాదాపు 20 నిమిషాలుంచాలి. ఇలా చేయడం వల్ల కాళ్లకు ఫంగస్ లేదా ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. అదే సమయంలో మీ కాలి మడమలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి.
ఇక మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది పచ్చిగడ్డిపై చెప్పుల్లేకుండా నడుస్తుంటారు. వర్షాకాలంలో ఇలా చేయకూడదు. ఎందుకంటే వర్షాకాలంలో కాళ్లకు ఆఛ్చాదన లేకుండా నడవటం వల్ల ఇన్‌ఫెక్షన్ ముప్పు ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం గోర్లను ఎప్పుడూ కట్ చేస్తుండాలి. ఎందుకంటే వర్షాకాలంలో గోర్లు కాస్త బలహీనంగా ఉండి త్వరగా విరిగే అవకాశాలున్నాయి. లేదా ఇన్‌ఫెక్షన్, ఫంగస్ గోర్లలో చేరుకుని ఇబ్బందిగా మారవచ్చు. అందుకే గోర్లు ఎప్పుడూ కట్ చేస్తుంటే శుభ్రంగా ఉండేందుకు అవకాశముంటుంది.
వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందనేది ఎవరూ ఊహించలేరు. అందుకే ఎప్పుడూ కాళ్లను పూర్తిగా కవర్ చేయని చెప్పులు లేదా షూస్ వాడాలి. ఫలితంగా కాళ్లకు అవసరమైన స్వచ్ఛమైన గాలి తగులుతుంది.
Also read: Uric Acid Problem: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉందా..డైట్‌లో ఈ మార్పులు చేస్తే చాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook