Skin Care Tips: మీరు ఆలూను అతిగా తింటున్నారా.. అయితే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Skin Care: బంగాళాదుంపను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. దుంపలో చాలా రకాల పోషకాలుండడం వల్ల ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 01:58 PM IST
  • మీరు ఆలూను అతిగా తింటున్నారా..
  • చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది
  • చర్మంపై దద్దుర్లు వస్తాయి
Skin Care Tips: మీరు ఆలూను అతిగా తింటున్నారా.. అయితే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Skin Care: బంగాళాదుంపను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. దుంపలో చాలా రకాల పోషకాలుండడం వల్ల ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనితో చేసిన ఆహారాలను తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అయితే దీని మిశ్రమాన్ని చాలా మంది శరీర, ముఖ సౌందర్యం కోసం వినియోగిస్తున్నారు. క్రమం తప్పకుండా ముఖానికి  బంగాళాదుంప మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణుల తెలుపుతున్నారు. అయితే వీటితో చర్మానికి ఎలాంటి చెడు ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

చర్మంపై చెడు ప్రభావం:

ప్రస్తుతం చాలా మంది బంగాళదుంపల మిశ్రమాన్ని చర్మానికి రుద్దుతున్నారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని చర్మానికి అస్సలు వాడొద్దని సూచిస్తున్నారు.

బంగాళాదుంప మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం మంచిదైనప్పటికీ.. అతిగా చర్మానికి రాసుకుంటే పలు రకాల చర్మ సమస్యలు వచ్చే అవకావశాలున్నాయి. అయితే పలు రకాల సమస్యల గురించి ప్రపంచ అధ్యయాన సంస్థలు ఇలా వివరించాయి. సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు బంగాళదుంపతో చేసిన మిశ్రమాన్ని అస్సలు వాడకూడదని అధ్యయానాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చే అవకాశాలున్నాయి.

అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు:

బంగాళదుంపలను ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఈ దుంపలలో అధిక పరిమాణంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కావున శరీరంలో కేలరీలను పెంచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఊబకాయ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు కీళ్లనొప్పుల సమస్య కూడా పెరుగుతాయి. బీపీతో బాధపడే వారు వీటిని అస్సలు తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అతిగా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో  బీపీ సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. కావున వీరు తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీటిని తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!

Also read:  Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్‌ బియర్డ్‌ వస్తుంది..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News