Dark Circles: ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అందవిహీనంగా చేసే కంటి కింది నల్లటి వలయాలు. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా.. ఆ చిట్కాలేంటో చూద్దాం.
అందంగా ఉండాలని..అందంగా కన్పించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా సమయం కేటాయించలేక ముఖం అందవిహీనంగా మారుతున్నా..ఏం చేయలేని పరిస్థితి. ఇంకొంతమందైతే ఏం చేయాలో తెలియక రకరకాల క్రీములు రాసుకుంటూ ముఖాన్ని ఇంకా పాడుచేసుకుంటుంటారు. ఆధునిక జీవన శైలి (Modern Lifestyle) కారణంగా వచ్చే సమస్యల్లో ఇదొకటి. ఇదే కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటం. ఇది వయస్సు మీరిన తరువాత కాదు..వయస్సులో ఉన్నప్పుడు కూడా వచ్చేస్తోంది. నిద్ర లేమి, ఒత్తిడి వంటివి కంటి కింది నల్లటి వలయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే..ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
ముఖం మెరిసిపోవాలంటే (Face Glow) ముందుగా తులసి ఆకుల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో తగిన మోతాదులో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవాలి. కాస్సేపు ఉంచుకుని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖంలో గ్లో వస్తుంది. ఇక టొమాటో, సీ సాల్ట్ కలిపి సౌందర్య సాధనంగా ఉపయోగించవచ్చు. ఆశ్యర్యంగా ఉందా. నిజమే ఇది. మీరు చేయాల్సిందల్లా ఒక టమోటా తీసుకుని కట్ చేసి..రసాన్ని వేరు చేసి ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది సహజమైన బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న డెడ్సెల్స్ను తొలగిస్తుంది. ముఖంలో మెరుపు వస్తుంది.
ఇక మరో పద్ధతి బాదం పప్పును నానబెట్టి..తినేటప్పుడు పొట్టు పాడేస్తుంటాం. అలా కాకుండా ఆ పొట్టును ఒంటికి రుద్దుకుంటే శరీరంలో మెరుపు వస్తుంది. బంగాళాదుంప తురుుముని ఐస్ వాటర్‌తో కాస్సేపు ఉంచి తీసేయాలి. ఇందులో తేనె కలిపి కళ్ల చుట్టూ రాసుకుని ఓ అరగంట విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే అద్భుత ప్రయోజనాలుంటాయి. రెండు టీ స్పూన్ల శెనగపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ నుంచి ముఖం వరకూ పట్టించి..పూర్తిగా ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మంలో మార్పు వస్తుంది. కంటి కింది నల్లటి వలయాలు (Eye Dark Circles) తగ్గుతాయి
Also read: Horsegram Benefits: ఉలవలతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook