Side Effects of Ginger: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల టీలను తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో చాలా మంది అల్లం టీని తాగుతూ ఉంటారు. కొంతమందైతే అల్లం లేని టీలను అస్సలు తాగరు. అయితే ఇలా అల్లం టీలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి లాభాలతో నష్టాలు కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరానికి చాలా రకాలుగా హాని చేయోచ్చని వారు చెబుతున్నారు. అయితే క్రమం తప్పకుండా ఈ టీలను తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం..
ఈ దుష్ప్రభావాలు తప్పవు:
గుండెల్లో మంట:
క్రమం తప్పకుండా అల్లం టీలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే నష్టాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవసరానికి మించి అల్లాన్ని టీలో తీసుకుంటే గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా క్రమం తప్పకుండా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
రక్తస్రావం:
చలికాలంలో అల్లం శరీరానికి వేడిని ఇస్తుంది. కాబట్టి ఎక్కువగా చలి, వానా కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో యాంటీ ప్లేట్‌లెట్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. అల్లంలోని ఈ లక్షణాలు రక్తస్రావం కలిగిస్తాయి.
అతిసారం:
అల్లం టీలను క్రమం తప్పకుండా తీసుకుంటే అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో డయేరియా వంటి తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి.
కడుపు నొప్పి:
అల్లం టీలను అతిగా తీసుకుంటే జీర్ణ శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా అతిగా తీసుకుంటే పొట్టలో సమస్యలు అధికమయ్యే అవకాశాలు అధికం. కాబట్టి
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Side Effects of Ginger: అల్లం టీలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు.. కాబట్టి అసలు తీసుకోవద్దు..
అల్లం టీలను తీసుకుంటే చాలా..
రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
గుండెల్లో మంటలు వంటి సమస్యలు అధికమవుతాయి.