How To Lose Belly Fat In 7 Days: ఊబకాయం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మందిలో ప్రస్తుతం గుండెపోటుతో పాటు మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాంతంగానూ మరే ఛాన్స్ కూడా ఉంది. ఇదే సమస్య కాకుండా బెల్లీ ఫ్యాట్ బారిన కూడా పడుతున్నారు. ఈ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ తగ్గించుకోలేకపోతున్నారు. ఆయితే ఈ రెండు సమస్యలతో బాధపడేవారు ఉదయం ఖాళీకడుపుతో వీటిని తాగాల్సి ఉంటుంది.
బరువు తగ్గించే డ్రింక్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ పద్ధతి:
బరువు తగ్గించే డ్రింక్ తయారు చేయడానికి ఒక గ్లాసు కొబ్బరి నీళ్ల తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఒక గ్లాస్‌లోకి పోసుకోవాలి.
ఈ నీటిలో 1 టీస్పూన్ సబ్జా గింజలను కలపండి.
వాటిని సుమారు 15 నిమిషాలు నానబెట్టి ఉబ్బనివ్వండి.
ఇలా తయారు చేసుకున్న డ్రింక్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
బరువు తగ్గడానికి కొబ్బరి సహాయపడుతుందా?:
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరినీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు బరువును తగ్గించడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సబ్జా గింజలు ఆకలిని నియంత్రించి శరీరాన్ని ఎక్కవ సేపు యాక్టివ్‌గా ఉంచుతాయి.
సబ్జా గింజల్లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది:
సబ్జా విత్తనాలు తులసి మొక్క నుండి లభిస్తాయి. వాటి లోపల ఫైబర్, చాలా రకాల విటమిన్లు లభిస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువు కూడా తగ్గుతారు.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook