Ramadan 2023: ఇఫ్తార్ విందులో మధుమేహం ఉన్నవారు ఈ ఆహారాలే తినాలి?, ఎందుకో తెలుసా..

Ramadan 2023 In India: రంజాన్ మాసం మొదలు కాబోతోంది. అయితే ఈ క్రమంలో మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇఫ్తార్ విందులో భాగంగా విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటారు. కాబట్టి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను తప్పకుండా పాటించాల్సింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 03:22 PM IST
Ramadan 2023: ఇఫ్తార్ విందులో మధుమేహం ఉన్నవారు ఈ ఆహారాలే తినాలి?, ఎందుకో తెలుసా..

Ramadan 2023 In India: రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుకు చాలా ప్రాధాన్యత ఉంది. ముస్లిం సోదరులంతా ఒకే చోట కూర్చొని బంతి భోజనాలు చేస్తారు. ఇలా చేయడాన్ని ఇఫ్తార్ విందుగా భావిస్తారు. అయితే ఈ సాంప్రదాయం కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి వస్తోంది. రంజాన్ ఫాస్టింగ్ లో భాగంగా ప్రార్థనలు నిర్వహించి సూర్యోదయానికి ముందు ఆహారాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ క్రమంలో మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారంలో తప్పకుండా నిపుణులు సూచించినవే తినాల్సి ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు రంజాన్ ఫాస్టింగ్ లో ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యోదయానికి ముందు ఈ ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది:
మధుమేహంతో బాధపడుతున్న వారు రంజాన్ ఉపవాసాల్లో తప్పకుండా నిపుణులు సూచించిన ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. రోజంతా శరీరం శక్తివంతంగా ఉండేందుకు ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, బనానా స్మూతీ వంటివి సూర్యోదయానికి ముందు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా బాడీ దృఢంగా ఉంటుంది.

చక్కెర పరిమాణాలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది:
రంజాన్ మాసంలో ప్రార్థన సమయాల్లో బిజీగా ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా మీ శరీరంలో గ్లూకోజ్ పరిమాణాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పరీక్షించుకోవడం చాలా మంచిది. ఒకవేళ పెరిగితే జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ఇఫ్తార్ విందు తినే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే:
మధుమేహంతో బాధపడుతున్న వారు ఇఫ్తార్ విందులో భాగంగా ఖర్జూర, స్వీట్స్, ఇతర వేయించిన ఆహారాలను తినడం మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అనారోగ్య ఆహారల కిందికి వస్తాయి. కాబట్టి వీటిని మానుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే సలాడ్స్ ను పచ్చి కూరగాయలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

వ్యాయామాలు చేయడం మానుకోవద్దు:
చాలామంది రంజాన్ నెల మాసంలో ప్రార్థనల్లో భాగంగా బిజీగా ఉంటారు. కాబట్టి వ్యాయామాలు చేయడం మర్చిపోతారు. అయితే ఇలా వ్యాయామాలు చేయడం మానుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా తేలికపాటి వ్యాయామాలతో పాటు వీలైతే యోగా కూడా చేయండి.

తగినంత నిద్ర:
ఆరోగ్యమైన ఆహారాలు తీసుకున్న తర్వాత తగిన మోతాదులో నిద్రపోవడం చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఏడు గంటలు తప్పకుండా నిద్ర పోవాల్సి ఉంటుంది. కాబట్టి మంచి ఆహారాలు తీసుకున్న తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తే.. శరీరంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

Also read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Also read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News