Pregnancy Tips: ఈ కాలంలో కోరుకున్న సమయంలో గర్భం రావడం లేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఉబకాయం ,హార్మోన్ల అసమతుల్యత కొంతమంది గర్భం ధరించిన పొట్ట లోపల బిడ్డ అవయవాలు సరిగా తయారు కాకపోవడంతో అబార్షన్ చేసుకునే స్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండాలంటే గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
గర్భం వచ్చిన మూడు నెలల్లోపే పిండం అవయవాలన్నీ ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ లోపం అలానే కొనసాగుతుంది. బిడ్డ ఎదుగుదలకు బయోటిన్ ఎంతో అవసరం దీన్నే విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. గర్భం ధరించిన మూడు నెలల్లోపు ఈ బి 7 విటమిన్ పుష్కలంగా ఉంటేనే బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. పిండం ఎదుగుదలకు గర్భవతులకు ఒక రోజుకు బయోటిన్ 37 గ్రాములు అవసరం ఉంటుంది. విటమిన్ బి7 అనేది నీళ్లలో కరిగే విటమిన్ ఇది వాటర్ సాల్యూబుల్ విటమిన్. విటమిన్ బి లోకి వచ్చే అన్ని విటమిన్స్ నీటిలో కరిగే విటమిన్లు.
ఇదీ చదవండి: ఎండు ద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే ఏమవుతుందో తెలుసా?
బయోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో సన్ఫ్లవర్ సీడ్స్ మొదటిది పాలకూర మెంతికూరల్లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది రోజు ఒక గుడ్డు తీసుకున్న అందులో బయోటిన్ ఉంటుంది బాదం జీడిపప్పులో కూడా బయోటిన్ కొద్దిస్థాయిలో ఉంటాయి.ఇక బయోటిన్ అత్యధిక స్థాయిలో ఉండే ఆహార పదార్థాల్లో అడవి పుట్టగొడుగులు ఒకటి ఇందులో 100 గ్రాముల అడవి పుట్టగొడుగుల్లో 22 మైక్రో గ్రాముల బయోటిన్ ఉంటుంది.
ఇదీ చదవండి: మధుమేహం ఉన్నవారు రాత్రి పడుకునేటప్పుడు ఈ ఒక్క పనిచేయండి..
ఇంకా బయోటిన్ అత్యధిక స్థాయిలో ఉండే మరో ఆహారం పన్నీర్ 100 గ్రాముల పన్నీర్లో 21 మైక్రో గ్రాముల బయోటిన్ ఉంటుంది. ఇక అత్యధిక స్థాయిలో బయోటినుండే చివరి ఆహారం అవిసె గింజలు 100 గ్రాములు అవిస గింజలు 21వ మైక్రో గ్రాముల బయోటిన్ ఉంటుంది. అవిసె గింజల్ని దోరగా వేయించి తినాలి వీటిని చట్నీలో కూరల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే బయోటిన్ పుష్కలంగా మన శరీరానికి అందుతుంది. బయోటిన్ ని ఉడకబెట్టి తీసుకుంటే జిగటగా ఉంటుంది కాబట్టి వాటిని మనం తినలేము. అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి వీటిని ఉండలు మాదిరిగా చేసుకొని కూడా తినవచ్చు అత్యంత తక్కువ ధరలు అందుబాటులో ఉండే అవిసగించాలను మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter