Noodles Facts In Telugu: ప్రస్తుతం చాలామంది పిల్లలు టిఫిన్స్‌కి బదులుగా నూడుల్స్‌ని తింటున్నారు. అలాగే ఇది స్ట్రీట్ ఫుడ్ గా కూడా విచ్చలవిడిగా లభిస్తుంది. దీంతో చాలామంది పిల్లల నుంచి పెద్దవారి వరకు దీనిని తినేందుకు అలవాటు పడ్డారు నిజానికి చాలామంది రోజులో ఒక్కసారైనా తింటున్నారు. అయితే ప్రతిరోజు మ్యాగీ ని తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సోడియం ఇతర రసాయనాలతో కూడిన మూలకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. అంతేకాకుండా కొంతమందిలో మ్యాగీని అతిగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా మ్యాగీని అతిగా తినే వారిలో క్యాన్సర్ కణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని వారు అంటున్నారు. అయితే మ్యాగీని ప్రతిరోజు తినడం వల్ల ఇవే కాకుండా ఇతర దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నూడుల్స్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
అధిక సోడియం:
అందరికీ తెలియని విషయం ఏమిటంటే నూడుల్స్‌ని అతిగా తినడం వల్ల రక్తపోటు గుండె సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇందులో సోడియం పరిమాణం అధిక మోతాదులో లభిస్తుంది. ఇది గుండె జబ్బులే కాకుండా ఇతర అనేక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అధిక కార్బోహైడ్రేట్లు:
అలాగే మ్యాగీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజులో రెండు సార్లు అయినా తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు విపరీతంగా పెరిగి బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో కొలెస్ట్రాలను కూడా పెంచుతుంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుదల:
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో రెండవ కారణం అతిగా మ్యాగీ తినడమే.. మ్యాగీని అతిగా తినడం వల్ల గుండెజబ్బులతో పాటు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలర్జీ సమస్యలు:
నూడుల్స్‌లో వివిధ రకాల కృతిమ రంగులు వాడతారు. కాబట్టి మ్యాగీని ఎక్కువగా తినడం వల్ల అలర్జీ వంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా తినేవారిలో సులభంగా అలర్జీ సమస్యలు వస్తాయని వారు అంటున్నారు.
లెస్ పోషక విలువలు:
మ్యాగీ లో ప్రోటీన్ల పరిమాణం అలాగే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు రోజు ఉదయాన్నే దీనిని తినడం వల్ల పోషకాహార లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీర్ణక్రియ సమస్యలు అలసట నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.