ఇండియాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంతోషిస్తున్న సమయంలో మరో కొత్త సవాల్ ఎదురైంది. దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వేగంగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైన బి.1.617.2 వేరియంట్ నుంచి మరో కొత్త వేరియంట్ (Delt Plus Variant) పుట్టుకొచ్చింది. భారత్ పుట్టుకొచ్చిన వేరియంట్లు B.1.617.1 మరియు B.1.617.2లను ఇండియా కరోనా వేరియంట్లు (Indian Covid-19 Variants) అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని రోజుల కిందట పేర్కొంది. ఈ క్రమంలో ఆ వేరియంట్లకు కప్పా మరియు డెల్టా వేరియంట్లుగా డబ్ల్యూహెచ్‌వో నామకరణం చేసింది.
Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన
ఇందులోని B.1.617.2 వేరియంట్ మరోసారి ఉత్పరివర్తనం చెందడంతో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ B.1.617.2.1ను డెల్టా ప్లస్ లేదా AY.1 variantగా పిలుస్తున్నారు. భారత్‌లో జూన్ 7 నాటికే ఏడు కరోనా శాంపిల్స్‌లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 63 మంది కరోనా (Coronavirus) బాధితులలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇంగ్లాండ్ సంస్థ పేర్కొంది. గతంలో ఈ రెండు వేరియంట్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో గుర్తించారు. కానీ మొదటగా భారత్‌లో గుర్తించడం, అనంతరం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా వ్యాప్తి చెందడం తెలిసిందే.
Also Read: Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్
తాజాగా ఐరోపా, ఆసియా, అమెరికా దేశాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. యూరప్ దేశాలలో మార్చి నెలలోనే తొలిసారిగా డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ కేసులు నమోదైనా, దాని ప్రభావం తక్కువగా ఉందని ప్రముఖ ఇమ్యునాలజిస్టులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ గురించి ఆందోళన అక్కర్లేదని తెలుస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి అధిక హాని లేదని సమాచారం. ఈ వేరియంట్ బారిన పడినవారిలో త్వరగా యాంటీబాడీలు రూపొంది కరోనా నుంచి బయటపడుతున్నారు.
Also Read: India Corona Recovery Rate: ఇండియాలో 95.64 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
అయితే కోవిడ్19 టీకాలు తీసుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మా తీసుకుని, కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యంపై పరీక్షలు జరుపుతారు. Sars-CoV-2 శాంపిల్స్ గుర్తిస్తే తమకు తెలియజేయాలని అన్ని జిల్లాల అధికారులకు మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవిడ్19 సాంకేతిక విభాగం చీఫ్ మరియా వాన్ కెర్ఖోవ్ కరోనా వేరియంట్ల పేరును ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook