National Digital Health Mission 2021: ఇక ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు, ఎలా పొందాలంటే

National Digital Health Mission 2021: దేశ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో అందరికీ వర్తించనుంది. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 07:44 PM IST
  • సెప్టెంబర్ 27న ప్రారంభమైన నేషనల్ హెల్త్ మిషన్ డిజిటల్ ఐడీ కార్డు
  • పైలట్ ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన పధకం
  • డిజిటల్ హెల్త్ కార్డు ప్రయోజనాలివే, ఇలా దరఖాస్తు చేసుకోండి
National Digital Health Mission 2021: ఇక ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు, ఎలా పొందాలంటే

National Digital Health Mission 2021: దేశ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో అందరికీ వర్తించనుంది. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ(Union Health Ministry)సెప్టెంబర్ 27వ తేదీన కొత్త ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. త్వరలో దేశమంతా విస్తరించనుంది. డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రజలందరికీ హెల్త్ కార్డుతో పాటు హెల్త్ ఐడీ అందిస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం కార్డులో పొందుపరిచారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు చికిత్స రికార్డుల్ని పోగొట్టుకుంటే డిజిటల్ హెల్త్ కార్డు (Digital Health Card)ఉపయోగపడుతుంది. హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా రోగి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వైద్యులకు కన్పిస్తుంది. కొత్త పరీక్షలు చేస్తే ఆ వివరాలు వెంటనే నమోదు చేయాలి. సంబంధిత సమాచారం ఈ వెబ్‌సైట్‌లో భద్రంగా ఉంటుంది. 

డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

హెల్త్ ఐడీ కార్డు కోసం ముందుగా https://healthid.ndhm.gov.in/register పోర్టల్ ఓపెన్ చేయాలి. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి నచ్చిన లాంగ్వేజ్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్‌పై రెండు ఆప్షన్లు కన్పిస్తాయి. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లింక్‌పై క్లిక్ చేసి వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. హెల్త్ ఐడీ కార్డు సృష్టించిన తరువాత సంబంధిత వ్యక్తి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. వ్యక్తిగత వివరాలు కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ తరువాత డిజిటల్ హెల్త్ కార్డు డౌన్‌లోడ్(How to Apply or Download Digital Health Card) చేసుకోవచ్చు.

Also read: Aadhaar card: ఏటీఎం కార్డు లాంటి ఆధార్ కోసం ఇలా అప్లై చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News