Massage Benefits: ఆవాల నూనె ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మంచిది. ఆవాల నూనెతో మస్సాజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
కాళ్లు, పాదాల మాలిష్ కోసం చాలా రకాల ఆయిల్స్ వినియోగిస్తుంటారు. కానీ ఆవాల నూనెతో పాదాలు మాలిష్ చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. పాదాలు అందంగా మారడమే కాకుండా..ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి. ఆ సమస్యలేంటో చూద్దాం.. ఆవాల నూనెతో కాళ్లు లేదా పాదాల మాలిష్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి పరిశీలిద్దాం..
1. ఒకవేళ మీరు నిద్ర సమస్యతో బాధపడుతుంటే..ఆవాల నూనెను పాదాలకు మాలిష్ చేయండి. 5-10 నిమిషాల మాలిష్ అనంతరం నిద్ర సమస్య దూరం కావడమే కాకుండా..నిద్రలేమితో ఎదురయ్యే సమస్యల్నించి కూడా ఉపశమనం పొందవచ్చు.
2. ఒకవేళ మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతుంటే..ఆవాల నూనెతో మాలిష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరం కావడమే కాకుండా..ఆందోళన కూడా పోతుంది.
3. ఆావాల నూనెతో కాళ్లకు మస్సాజ్ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతోపాటు మొత్తం శరీరానికి రక్త సరఫరా బాగుంటుంది.
4. కాళ్ల నొప్పులు వంటి సమస్యలుంటే క్రమం తప్పకుండా రోజూ నిద్రపోయే ముందు 5-10 నిమిషాలు ఆవాల నూనెతో మాలిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా లాభాలుంటాయి.
5. కుదించుకుపోయిన రక్త నాళాలు, బ్లాకేజెస్‌ను సరి చేసేందుకు ఆవాల నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మాలిష్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
6. జాయింట్స్ పటిష్టత కోసం ఆవాల నూనె మస్సాజ్ బాగా పనిచేస్తుంది. జాయింట్స్ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
Also read: Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook