Health Seeds: మధుమేహం వదలడం లేదా, రోజూ ఈ విత్తనాలు తీసుకుంటే చాలు

Health Seeds: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా వేసవిలో విరివిగా లభించే మస్క్ మెలన్. ఆరోగ్యరీత్యా అద్భుతమైన ప్రయోజనాలు కల్గించే ఈ ఫ్రూట్ విత్తనాలు కూడా ఆరోగ్యరీత్యా మంచివి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2024, 07:27 PM IST
Health Seeds:  మధుమేహం వదలడం లేదా, రోజూ ఈ విత్తనాలు తీసుకుంటే చాలు

Health Seeds: వేసవి కాలం కావడంతో మార్కెట్‌లో ఎక్కువగా దోసకాయలు, పుచ్చకాయలు కన్పిస్తున్నాయి. వేసవి దాహం తీర్చేందుకే కాకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా అద్భుతంగా కాపాడే ఫ్రూట్స్ ఇవి. ఇందులో ప్రదానంగా చెప్పుకోవల్సింది మస్క్ మెలన్ గురించి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఫ్రూట్ ఇది. చాలామంది మస్క్ మెలన్ తిన్న తరువాత విత్తనాలు పడేస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అసలు ఆరోగ్యమంతా ఆ విత్తనాల్లోనే ఉంది.

మస్క్ మెలన్ విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు చాలా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఐరన్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షించడంలో ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. 

మస్క్ మెలన్ విత్తనాల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ కారణంగా చర్మ, కేశాల సంరక్షణకు అద్భుతంగా ఉపయోగం ఉంటుంది. చర్మాన్ని కేశాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు బలం అందిస్తాయి. ఇందులో పెద్దఎత్తున లభించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వివిధ రకాల సీజనల్ వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. 

దోసకాయ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కారణంగా డయాబెటిస్ రోగులకు చాలా మేలు కలుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. క్రమం తప్పకుండా మస్క్ మెలన్ విత్తనాలు తీసుకుంటే మధుమేహం నియంత్రించవచ్చు. ఈ విత్తనాల్లో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ దూరమౌతుంది. అదే సమయంలో హెచ్‌డీఎల్ పెరుగుతుంది. 

Also read: Fatty Liver Diet: ఈ 5 ఫుడ్స్ కాలేయంలో పేరుకున్న విషపూరిత పదార్థాలను బయటకు తరిమేస్తాయి..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News