Muskmelon Benefits: ప్రస్తుతం మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరాయి. దీంతో శరీరానికి తగిన నీరు శాతం కావాల్సి ఉంది. ఈ క్రమంలో శరీరానికి మేలు చేసే కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగడం శ్రేయస్కరం. పండ్ల రసాల్లో ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజ వంటి వాటిలో ఎక్కువ నీటి శాతం ఉండడం వల్ల ఆ పండ్ల రసాలు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. కర్బూజ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తగిన నీరు శాతాన్ని అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ చేకూరుస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్భూజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1) మన శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లలో కర్బూజ ఒకటి.
2) కర్బూజలో విటమిన్ - ఏ పుష్కలంగా ఉండడంతో పాటు సోడియం, కాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఫైబర్, జింక్ లాంటి మూలకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.
3) కర్బూజను తిన్నా లేదా జ్యూస్ తాగినా వేసవితాపం నుంచి ఉపశమనం వస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా శరీరంలో నీటి శాతాన్ని సమతౌల్యంగా ఉంచుతుంది.
4) వేసవిలో కర్బూజ పండును తినడం వల్ల కంటిపై ఎండ ఒత్తిడి తగ్గుతుంది. చర్మం పొడిబారకుండా కర్భూజ ఉపయోగపడుతుంది.
5) కర్బూజలో నీటిశాతం అధికంగా ఉండడం మూలంగా.. వేసవిలో కర్బూజను తింటే డీహైడ్రేషన్ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. తద్వారా వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు.
6) కర్బూజను తినడం వల్ల వేసవిలో రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సంబంధిత జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Sugarcane Juice Benefits: వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
Also Read: White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook