Health Benefits Of Mushrooms: మష్రూమ్ కర్రీని ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. అయితే మార్కెట్‌లో ఇవి ఎక్కువగా వానా కాలంలో మాత్రమే లభిస్తాయి. మంచి మష్రూమ్ సంవత్సరంలో 8 రోజులు మాత్రమే లభిస్తాయట. వీటిని రైతు ఎక్కువగా అడవి ప్రాంతాల్లో సఖువా చెట్టు నుంచి సేకరిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో మష్రూమ్ ధరలు కిలో రూ.600 నుంచి 800 వరకు పలుకుతుంది. టెటనస్ మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల శరీరానికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టెటానస్ మష్రూమ్స్ ప్రయోజనాలు:
విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది:
టెటానస్ మష్రూమ్‌లో విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటి సీజన్ కాలంలో కర్రీలాగా తయారు చేసుకుని తినడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు విటమిన్ డి లోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పుట్టగొడుగులలో పాలిసాకరైడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. దీంతో పాటు కరిగే ఫైబర్, బీటా-గ్లూకాన్ కూడా లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సీజన్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి:
ఒత్తిడి కారణంగా చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు తప్పకుండా టెటానస్ మష్రూమ్స్ ఆహారాల్లో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
గుండెను సమస్యలు రావు:
టెటనస్ మష్రూమ్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా సులభంగ ఊబకాయం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి