Mango Shake Side Effects: వేసవి అంటేనే మ్యాంగో సీజన్. నోరూరించే మామిడి పండ్లు వేసవిలో పుష్కలంగా దొరుకుతాయి. మామిడి పండ్లను ముక్కలుగా కోసుకుని తినొచ్చు లేదా జ్యూస్‌లా తీసుకోవచ్చు. మ్యాంగో మిల్క్ షేక్స్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది మ్యాంగో మిల్క్ షేక్ చాలా ఇష్టపడుతారు. అయితే
మ్యాంగో షేక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మ్యాంగో షేక్స్ అతిగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
మ్యాంగో షేక్స్ సైడ్ ఎఫెక్ట్స్ :
మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అసలే వేసవి ఉష్ణోగ్రతల కారణంగా శరీరం వేడికి గురవుతుంది. మ్యాంగో షేక్స్ అతిగా తీసుకుంటే మరింత వేడి చేస్తుంది.
మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కాబట్టి మ్యాంగో షేక్స్‌ను పరిమితికి మించి తీసుకోకూడదు.
మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పొట్ట సమస్యలు వస్తాయి. వాంతులు, వికారం వంటి సమస్యలు రావొచ్చు.
మ్యాంగో షేక్స్ ఎక్కువగా తాగడం వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి దురద, దద్దుర్లు మొదలైన సమస్యలు వస్తాయి.
మ్యాంగో షేక్స్ మాత్రమే కాదు... ఏదైనా సరే అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కాబట్టి ఏ ఆహారమైనా ఒక పరిమితి మేరకే తీసుకోవాలి. రుచికరంగా ఉంది కదాని ఎక్కువగా లాగిస్తే లేని సమస్యలు వస్తాయి.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Shani Transit 2022: ఈ మూడు రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook