Lemon Side Effects: నిమ్మ రసాన్ని అతిగా తాగితే.. ఈ సమస్యలు తప్పవు..!

Lemon Side Effects: నిమ్మకాయలో  విటమిన్ సి(Vitamin C) అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఆహారంలో నిమ్మరసాన్ని వినియోగిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 01:03 PM IST
  • నిమ్మ రసాన్ని అతిగా తాగితే..
  • జీర్ణక్రియ సమస్యలు, నిర్జలీకరణ సమస్య..
  • పొడి చర్మం సమస్య వస్తాయి.
Lemon Side Effects: నిమ్మ రసాన్ని అతిగా తాగితే.. ఈ సమస్యలు తప్పవు..!

Lemon Side Effects: నిమ్మకాయలో  విటమిన్ సి(Vitamin C) అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఆహారంలో నిమ్మరసాన్ని వినియోగిస్తారు. అంతేకాకుండా భారత్‌లో చాలా మంది నిమ్మ రసాన్ని వినియోగించి ఆహారాన్ని తయారు చేస్తారు. అయితే నిమ్మకాయను అతిగా వినియోగిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు  తెలుపుతున్నారు. నిమ్మకాయలను ఎక్కువగా ఆహారంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాల వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్యలు తప్పవు:

జీర్ణక్రియ సమస్యలు:

ప్రస్తుతం చాలా మంది బరువును నియంత్రించుకునేందుకు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మకాయ నీటిని తాగుతారు. ఇలా తాగడం వల్ల  జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మ రసాన్ని తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్జలీకరణ సమస్య:

నిమ్మరసాన్ని అతిగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని అతి తాగడం వల్ల శరీరంలోని నీటి సమస్యలు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నొప్పుల రావడం:

నిమ్మరసంలో అధిక పరిమాణంలో ఆమ్లంగా ఉంటుంది. కావున పంటి నొప్పి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దంతాల సున్నితత్వం పెరుతుంది.

 పొడి చర్మం సమస్య:

ఈ రసాన్ని అతిగా తీసుకోవడం వల్ల చర్మం పొడి బారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు నిమ్మ రసానికి దూరంగా ఉండడం చాలా మేలు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News