Kidney Stones: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైంది కిడ్నీలు. తినే ఆహారం ఫిల్టర్ అయ్యేది ఇక్కడే. ఇదే లేకుంటే మనిషి మొత్తం విషపూరితమౌతాడు. ఎప్పటికప్పుడు విష పదార్ధాలను బయటకు తొలగించేది కిడ్నీలే. అందుకే కిడ్నీ ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విన్పిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు. దీనికి ప్రధాన కారణం నీటి కొరత. అంటే డీహైడ్రేషన్ సమస్య రావడం.
మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అందులోని మినరల్స్, ఉప్పు కిడ్నీలో పేరుకుపోయి చిన్న చిన్న కణాల నుంచి పెద్ద పెద్ద రాళ్లుగా మారిపోతాయి. మూత్రంలో మినరల్స్ కాన్సంట్రేషన్ అధికమైనప్పుడు ఈ పరిస్తితి ఉంటుంది. ఇలాంటప్పుడు కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు రాళ్లుగా మారుతుంటాయి. నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తతుంది. శరీరంలో నీటి కొరత ఉంటే యూరిన్ పరిమాణం తగ్గిపోతుంది. యూరిన్ గాఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవే కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణమౌతుంటాయి. సకాలంలో ఈ సమస్యను గుర్తించకపోతే చిన్న చిన్న రాళ్లు కాస్తా పెద్దవిగా మారిపోవచ్చు. అప్పుడు సర్జరీ ద్వారా తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది.
సాధారణంగా డీ హైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ గాఢత పెరుగుతుంది. దాంతో క్రిస్టలైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దాంతో శరీరంలో నొప్పి, యూరిన్ నుంచి రక్తం రావడం, తరచూ మూత్రం రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అదే రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తాగడం వల్ల యూరిన్ లో ఉండే మినరల్స్, ఉప్పను పల్చగా మార్చవచ్చు ఎప్పుడైతే యూరిన్ పల్చబడిందో రాళ్లు ఏర్పడే పరిస్థితి తగ్గుతుంది. అందుకే రోజు క్రమం తప్పకుండా 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ప్రత్యేకించి వేసవి కాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే చికిత్స వేర్వేరు రకాలుగా ఉంటుంది. రాళ్ల పరిమణం బట్టి ఎలాంటి చికిత్స అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నవిగా ఉంటే సహజపద్ధతిలో వాటిని కరిగించి బయటకు తొలగిస్తారు. అదే పరిమాణం పెద్దవిగా ఉంటే సర్జరీ అవసరం రావచ్చు. అందుకే కిడ్నీల ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ ఆప్రమత్తంగా ఉండాలి.
Also read: Weight Loss Remedy: రోజూ ఈ నీళ్లు ఇలా తాగితే అధిక బరువు సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.