Foods For Kidney Health: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద నిపుణులు చిట్కాలు పాటించండి

kidney health tips: కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2024, 02:05 PM IST
Foods For Kidney Health: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఆయుర్వేద నిపుణులు చిట్కాలు పాటించండి

kidney health tips: ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరంలో ఉండే వ్రత పదార్థం తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు కొన్ని మూలికలను ఉపయోగించడం వల్ల ఎలాంటి కిడ్నీ సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా ఏదైనా సమస్య కారణంగా కిడ్నీలో దెబ్బ తినడం వల్ల దీని శక్తి పోతుంది. మూత్రపిండాల వాడకం ఒక శక్తి తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.నీరు పుష్కలంగా తీసుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కలుగుతాయి. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడితే ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ఈ మూలికలను ఉపయోగించడం వల్ల వెంటనే ఈ మూత్రపిండాల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఎలాంటి మౌనికలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

రేగుట ఆకు : 
 
రేగుట ఆకు మూత్రపిండాల ఆరోగ్యానికి ఒక అద్భుతమైన మూలిక అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ లో మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సమస్యలను తొలగించడంలో మెరుగుగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీలో కలిగే రాళ్ళు  నివారించడంలో ఉపయోగపడుతుంది.

అల్లం:

అల్లం ఆయుర్వేదం శాస్త్రంలో ప్రసిద్ధ స్థానం పొందింది. ఇందులో ఆంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఉంటాయి. మూత్రపిండాల సమస్య నుంచి సహాయపడుతుంది. అల్లం తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలో కలిగి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. 

పసుపు: 

పసుపులో ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు ఉంటాయి. ఇది మూత్రపిండాలలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.పసుపు స్ఫటికాలు, రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు.

క్రాన్బెర్రీస్: 

ఈ  క్రాన్బెర్రీస్‌  మూత్ర నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కిడ్నీలో కలిగే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.క్రాన్‌బెర్రీస్‌లో ప్రోయాంతోసైనిడిన్స్ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా హనీ కరమైన వైరస్‌ బారిన పడకుండా రక్షిస్తుంది.  అలాగే ఇది మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మందార టీ: 

మందార టీలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.  ఇవి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

Trending News