Kidney Health tips: ఈ 4 టిప్స్ పాటిస్తే కిడ్నీలు సదా ఆరోగ్యంగా ఉంటాయి

Kidney Health tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కిడ్నీలు కీలకమైనవి. గుండె ఎంతముఖ్యమో ఇదీ అంతే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకే శరీరంలోని అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2024, 05:15 PM IST
Kidney Health tips: ఈ 4 టిప్స్ పాటిస్తే కిడ్నీలు సదా ఆరోగ్యంగా ఉంటాయి

Kidney Health tips: ఇతర సీజన్లతో పోలిస్తే వేసవి కాలంలో చాలావరకూ ఆరోగ్యం ఉంటుంది. కానీ కొన్ని అవయవాల పనితీరుపై మాత్రం వేసవి ప్రభావం చూపించగలదు. అందులో కిడ్నీలు ఒకటి. వేసవిలో కిడ్నీలు త్వరగా దెబ్బతినే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఈ పరిస్థితి కన్పించవచ్చు. వాతావరణంలోని హ్యుమిడిటీ ఇందుకు కారణం కావచ్చు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.

శరీరంలోని విష, వ్యర్ధ పదార్ధాలను ఫిల్టర్ చేసే అతి ముఖ్యమైన పని కిడ్నీలు నిర్వహిస్తాయి. దీనికి నీటి అవసరం చాలా ఎక్కువ. ఒకవేళ శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఆ ప్రభావం అంతా కిడ్నీలపై ఒత్తిడి పెంచేందుకు దారితీస్తుంది. కిడ్నీలు విఫలం కావడం లేదా దెబ్బతినడం జరగవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కిడ్నీలను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

కిడ్నీ వ్యాధి లక్షణాలు

తరచూ మూత్రం రావడం, చర్మం అదే పనిగా దురదగా ఉండటం, బ్యాక్ పెయిన్, ఛాతీలో నొప్పి, బలహీనత, తీవ్రమైన అలసట, చేతులు-కాళ్లు వాపు, యూటీఐ ఇన్‌ఫెక్షన్, ఆకలి తగ్గడం, అధిక రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్వెల్లింగ్ వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి. వేసవి కాలంలో మరింత ఎక్కువ తాగాల్సి ఉంటుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరంలో వ్యర్ధాలు, యాసిడ్ పేరుకుపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకే వేసవిలో ప్రతి రెండు గంటలకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగుతుండాలి. అంతేకాకుండా వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఈ రెండు దురలవాట్లు కిడ్నీల్ని పాడు చేస్తాయి. ఈ అలవాట్లుంటే వెంటనే మానేయడం మంచిది. స్థూలకాయం కూడా కిడ్నీ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే బరువు తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోజూ హెల్తీ డైట్ తీసుకోవడమే కాకుండా తగినంతగా వ్యాయామం చేయాలి.

అన్నింటికంటే ముఖ్యంగా తినే ఆహారంలో ఉప్పు, షుగర్ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ రెండు ఎక్కువైతే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. 

Also read: Dates Benefits: పీరియడ్స్ సమస్యలకు చెక్, రోజుకు 3-4 తింటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News