Ways to Reduce Joint knee Pain: పూర్వీకులు వృద్ధాప్య దశలో కీళ్ల నొప్పుల బారిన పడేవారు. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా కీళ్లలో వాపు, నొప్పుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలు కూడా ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమై ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగానే చిన్న వయసులో కీళ్ల నొప్పుల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో గ్రౌండ్‌కి వెళ్లకుండా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుకోవడం కారణంగానే తీవ్ర కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ నొప్పుల నుంచి వీలైనంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మేలు..లేకపోతే తీవ్ర నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు ఇవే:
❊ జన్యుపరమైన కారణాలు
❊ ఆటో ఇమ్యూన్ డిజార్డర్
❊ కాల్షియం లోపం
❊ ఊబకాయం
❊ గాయం కారణంగా నొప్పి
❊ కండరాల బలహీనత
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
కీళ్ల నొప్పులను ఎలా గుర్తించాలో తెలుసా?:
❊ కీళ్లలో తీవ్ర నొప్పులు రావడం.
❊ చలికాలంలో ఈ నొప్పి ఎక్కువగా కావడం.
❊ నడక కూడా కష్టంగా మారడం.
❊ మెట్లు ఎక్కే క్రమంలో తీవ్ర నొప్పులు రావడం.
❊ తరచుగా అలసట రావడం.
కీళ్ల నొప్పులను ఇలా తగ్గించుకోండి:
❊ గత కొన్ని సంవత్సరాల నుంచి కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
❊ చల్లని నీటితో స్నానం చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
❊ చల్లని గాలులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. శరీరానికి వెచ్చదనం అందివాల్సి ఉంటుంది.
❊ స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడుకోవాలి.
❊ నిపుణుల సలహాతో యోగా, వాకింగ్ చేయ్యాల్సి ఉంటుంది.
❊ శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
❊ ప్రతి రోజు ఆహారంలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook