Increase Hemoglobin Food: రక్తంలో హిమోగ్లోబిన్ లోపం కారణంగా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. హిమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్..దీని వల్ల బాడీలోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ సరఫర అవుతుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గుతున్నాయి. దీని కారణంగా రక్తహీనతతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీటిని ఆహారాల్లో తీసుకోండి:
బచ్చలికూర:
పాలకూర శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఐరన్లు లభిస్తాయి. దీంతో దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
బీట్రూట్:
బీట్రూట్లో ఫోలేట్, ఐరన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని జ్యూస్‌ల తయారు చేసుకుని ప్రతి రోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
యాపిల్స్:
యాపిల్ చాలా రకాల వ్యాధులకు ఔషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్‌తో పాటు ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్త కోరత నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్‌ను స్థాయిలను పెంచేందుకు కూడా సహాయపడుతుంది.
దానిమ్మ:
దానిమ్మ కూడా రక్తాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అధిక పరిమాణంలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్‌తో పాటు పొటాషియం లభిస్తుంది. కాబట్టి ఇందులో ఉండే గింజలను రోజు ఉదయాన్నే తినడం వల్ల రక్తం శుద్ధి కావడమేకాకుండా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.
గుడ్లు:
గుడ్లలో అధిక పరిమాణంలో ప్రొటీన్లుతో పాటు విటమిన్ బి12 అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి హిమోగ్లోబిన్ లోపం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు గుడ్లను డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి