Get Immediate Relief from Constipation: బొప్పాయి పండులో శరీరానికి కావాల్సింది చాలా రకాలు ఔషధ గుణాలు లభిస్తాయి. రక్త కణాల లోపం సమస్యలతో బాధపడుతున్న వారిని వైద్యులు వీటిని తినమని సూచిస్తారు. అయితే పచ్చి బొప్పాయతో చేసిన హల్వాను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ హల్వాను క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరం కావడమే కాకుండా శరీరం డిటాక్స్ కూడా అవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రెసిపీని బరువు తగ్గాలనుకున్నవారు ప్రతిరోజు తినడం వల్ల చాలా సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హల్వాలో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఈ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండు హల్వాను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- 500 గ్రాముల పచ్చి బొప్పాయ
- పావు లీటర్ పచ్చిపాలు
- రెండు టీ స్పూన్ల నెయ్యి
- రుచికి సరిపడా చక్కెర
- ఒక కప్పు డ్రైఫ్రూట్స్
- ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి
- అర టీ స్పూన్ యాలకులు
బొప్పాయి పండు హల్వాను తయారు చేసుకునే విధానం:
- ముందుగా ఓ పచ్చి బొప్పాయను తీసుకోండి. దానిపై పొట్టు తీసి సన్నగా తరుముకోండి.
- ఆ తర్వాత పోయి వెలిగించి.. దానిపై ఓ బాండి పెట్టుకోండి.
- ఆ బాండీలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నెయ్యిలో తురిమి పెట్టుకున్న పచ్చి బొప్పాయ తురుమును వేసి బాగా వేపుకోవాలి.
- ఇలా వేపుకున్న తర్వాత కలుపుకుంటూ పాలను వేసుకోవాల్సి ఉంటుంది.
- అందులో పాలను వేసిన తర్వాత చిక్కబడేంత సేపు బాగా ఉడికించాల్సి ఉంటుంది.
- తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
- ఇలా కలుపుకున్న హల్వాను మరో ఐదు నిమిషాలు ఉడికించి దానిపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఇక బొప్పాయి హల్వా రెడీ అయినట్టే.
- ఇలా తయారు చేసుకున్న హల్వాను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Naatu Naatu Oscar Journey: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ వెనుక ఎం జరిగింది, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook