Health Tips: మీకు ఇలా వేలు పెట్టుకునే అలవాటు ఉందా..? చాలా ప్రమాదకరం..

Alzheimer And Dementia Symptoms: ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? దీని వల్ల మెదడులోని నరాలు కుంచించుకుపోయి అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు ఏంటి..? వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 08:59 AM IST
Health Tips: మీకు ఇలా వేలు పెట్టుకునే అలవాటు ఉందా..? చాలా ప్రమాదకరం..

Alzheimer And Dementia Symptoms: మనలో చాలా మందికి ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువ మందిలో కూర్చున్నప్పుడు.. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఈ అలవాటు ఇబ్బందిగా మారుతుంది. ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఈ పరిశోధన ఎలుకలపై నిర్వహించి చెప్పారు. గ్రణ నాడి మన ముక్కులో ఉంటుంది. ఇది నేరుగా మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది. మనం ముక్కులో వేలు పెట్టుకుంటే వైరస్‌లు, బ్యాక్టీరియాలు నేరుగా ఈ  నాడి ద్వారా మెదడు కణాలకు చేరుతాయి. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు.

డిమెన్షియా అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి ఉన్న వారికి మెదడులోని నరాలు కుంచించుకుపోయి కణాలు నశించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా మెదడులోని కణాలు చురుగ్గా తగ్గుతాయి. మెదడులోని హిప్పోకాంపస్ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. హిప్పోకాంపస్ అనేది మన విషయాలను గుర్తు పెట్టుకోవడానికి పని చేస్తుంది. దీనిపై ప్రభావం చూపిస్తే మనకు జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. 

క్లామిడియా న్యుమోనియా అనే బ్యాక్టీరియా అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని కలిగిస్తుంది. ఇది ముక్కు నుంచి గ్రణ నాడి ద్వారా మన నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి మెదడు వ్యాధులకు కారణమవుతుంది. ఈ బాక్టీరియా, వైరస్‌లు మెదడులో అమిలాయిడ్ బీటా ప్రొటీన్‌ను నిర్మించేలా చేస్తాయి. ఇది అల్జీమర్స్, డిమెన్షియాకు కారణమవుతుంది.

అల్జీమర్స్ మొదటి దశ లక్షణాలు.. 

  • విషయాలు మరచిపోయి.. మళ్లీ అడుగుతారు
  • స్థలాలు, వ్యక్తుల పేర్లను మర్చిపోవడం.
  • వస్తువులను ఎక్కడో ఉంచడం మర్చిపోవడం.
  • కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది.

అల్జీమర్స్ మధ్య దశ  లక్షణాలు

  • జ్ఞాపకశక్తి లోపించడం వల్ల మళ్లీ మళ్లీ ఏదో ఒక పని చేయడం.
  • నిద్ర లేకపోవడం, మనసులో భారం.
  • చూడటం, వినడం, వాసన చూడటంలో ఇబ్బంది.

అల్జీమర్స్  తీవ్రమైన లక్షణాలు

  • వేగవంతమైన బరువు నష్టం.
  • షార్ట్ లేదా లాంగ్ టర్మ్ మెమరీ లాస్ (జ్ఞాపకశక్తి కొన్నిసార్లు బాగా, కొన్నిసార్లు చాలా బలహీనంగా మారుతుంది) 
  • ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది. 

ఇలా రక్షించండి

మీరు అల్జీమర్స్‌ను నివారించాలనుకుంటే.. కొన్ని అలవాట్లను వదిలివేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా కొన్ని మంచి అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. దీన్ని నివారించాలంటే ముక్కులో వేలు పెట్టుకోవడం, పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. మనసు దృఢంగా ఉండాలంటే మెదడుకు వ్యాయామం అవసరం. మెదడు వ్యాయామం కోసం మీరు చెస్, వర్డ్ క్యాచింగ్ వంటి ఆటలను ఆడాలి. మెదడు ఆరోగ్యంలో ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అధికంగా తింటే అల్జీమర్స్‌ను అధికమించవచ్చు.

NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు

Also Read: Ind vs Eng Semi Final Match: ఇండియా vs ఇంగ్లండ్ మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనా ?

Also Read: T20 World Cup: రోహిత్, విరాట్ కోహ్లి గుడ్ బై.. బీసీసీఐ సంచనల నిర్ణయాలు..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News