Techniques Of Stress Management: నేటి ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా మంది ఈ ఒత్తిడి కారణంగా బీపీ , గుండె జబ్బలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే మీరు ఈ టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది. ఈ చిట్కాలు మీకు ఎంతో మేలు చేస్తాయి.
మీరు తీవ్రమైన ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా అయితే ముందుగా మీరు చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. వాటిని పూర్తి చేయడం మీ గోల్‌గా చేసుకోండి. దీని వల్ల మీరు ఒత్తిడి సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కొంతమంది చిన్న సవాళ్ళకు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతారు. ప్రతి విషయంలో నెగిటివ్‌గా ఆలోచిస్తారు. దీని వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీరు వ్యతిరేక ఆలోచనలను చేయడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు.
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు ఎమోషన్ల కంట్రోల్లో ఉంచుకోవాలి. దీని కోసం జోక్స్ వీడియోలు చూడటం, కామెడీ మూవీకి వెళ్ళడం వంటి చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.
ఒత్తిడిని ఎదుర్కోవడానికి కుటుంబ వ్యక్తులు, ఇష్టమైనవారితో మాట్లాడం వల్ల ఈ ఒత్తిడి సమస్య నుంచి తగ్గించడంలో సహాయంగా ఉంటారు.
పోషకాలతో కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సమస్య బారిన పడకుండా ఉంటారు.
ప్రతిరోజు ఉదయం వ్యాయామాలు చేయండం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేయడం వల్ల యాంగ్జయిటీని తగ్గించే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.
ఆకుకూరలు, లో ఫ్యాట్ చీజ్, బాదంపప్పులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోగల శక్తిని అందిస్తాయి.
మనిషి ఆత్మవిశ్వాసంతో ఉన్నంత వరకూ ఎటువంటి ఒత్తిడైనా సరే చిత్తయిపోతుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల మనిషి ఒత్తిడికి ఎప్పుడూ లొంగకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter