How To Lower Cholesterol Level: చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు.. శరీరానికి అవసరమైన రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల తీవ్ర రక్త పోటు సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున ఇలాంటి సమస్యల బారిన పడకుండా తప్పకుండా రోజూ తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధులు కూడా రావొచ్చు కావున జాగ్రత్త వహించాలని నిపుణులు అభిప్రాయడుతున్నారు. అయితే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహార నియమాలు పాటించాలి:
1. రోజూ గ్రీన్ టీ తాగండి:
రోజూ తాగే ఛాయ్, టీలో చక్కెర పరిమాణం అధికంగా ఉంటుంది. కావున వీటిని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే టీలకు బదులగా గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ రోజూ మూడు సార్లు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. కావున బరువు తగ్గడానికి, మధుమేహం తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ గ్రీన్ టీని తీసుకోవాలి.
2. పోషకాలున్న పండ్లు తినండి:
ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యమైన ఆహారాలను తింటున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి బదులు అధిక పోషకాలు ఆహారాలను తింటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. అయితే ఈ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి.
3. సోయాబీన్స్:
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రభావవంతంగా పని చేస్తుంది. కావున ప్రోటిన్ గల ఆహారాల కోసం సోయాబీన్స్‌ను ఆహారంలో బాగంగా చేసుకోండి. ఇందులో అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
4. ఈ మసాలా దినుసులను ఆహారంలో తీసుకోండి:
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడానికి తప్పకుండా హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అయితే మసాలా దినుసుల్లో కూడా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. కావున బరువు తగ్గడానికి, చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి పసుపు, అల్లం, దాల్చినచెక్క మరియు వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook