Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి

How To Keep Your Teeth Bright And Shiny: ఎవరినైనా కలిసినప్పుడు నవ్వుతూ పలకరించడం అనేది ఒక మంచి అలవాటు. ఆ నవ్వు ఎన్నో బంధాలను చేరువ చేస్తుంది. అయితే, ఆ నవ్వు ఇంకా అందంగా ఉంటాలంటే మాత్రం మంచి పళ్లవరుస, ఆరోగ్యకరమైన దంతాలు తప్పనిసరి. మరి ఇంతకీ దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసేలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఈ డీటేల్స్‌పై ఒక లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2023, 08:17 PM IST
Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి

How To Keep Your Teeth Bright And Shiny: రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉండే టూత్ పేస్టుతో బ్రషింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఉదయంతో పాటు రాత్రి పడుకునే ముందు కూడా బ్రషింగ్ చేసుకుంటే దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అలాగే దంతాల్లో పుప్పి రాకుండా ఉండటం కోసం పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తొలగిస్తూ రోజుకొకసారి ఫాసిల్ చేస్తూ ఉండాలి. 

పంచధార వినియోగం తగ్గించాలి
పంచధార కలిపిన ఆహార పదార్థాలు తినడం తగ్గించాలి. అలాగే ఎసిడిక్ ఫుడ్స్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా నివారించాలి. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు లేదా పానియాలకు దంతాలపై ఉండే ఎనామిల్ పొరను తొలగించే గుణం ఉంటుంది. దంతాలపై ఎనామిల్ పొర లేచిపోతే.. మీ దంతాలు తెల్లటి మెరిసే రంగును కోల్పోవడంతో పాటు అందవిహీనంగా మారిపోతాయి. 

ఆహారం తిన్న వెంటనే..
ఆహారం తిన్న వెంటనే శుభ్రంగా పుక్కిలించి ఉమ్మి వేయడం మర్చిపోవద్దు. లేదంటే పళ్ల మధ్య చిక్కుకున్న ఆహార పదార్థాల వల్ల దుర్వాసన రావడంతో పాటు పుప్పి పళ్లుగా మారి దంతాలు సహజ కాంతిని కోల్పోతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చివరకు దంతాలను తొలగించే వరకు కూడా వెళ్తుంది.

చూయింగ్ గమ్ తినే అలవాటు ఉన్న వారికి..
చూయింగ్ గమ్ తినే అలవాటు ఉన్న వారు షుగర్‌లెస్ చూయింగ్ గమ్‌నే ప్రిఫర్ చేయాలి. అది కూడా ఆహారం తిన్న తరువాతనే షుగర్‌లెస్ చూయింగ్ గమ్ ప్రిఫర్ చేయాలి. షుగర్‌తో తయారైన చూయింగ్ గమ్ దంతాలపై దుష్బ్రభావం చూపిస్తుంది.

తగినన్ని నీళ్లు తాగాలి
రోజుకు తగినన్నీ నీళ్లు తాగాలి. అలా చేయడం వల్ల నోటిలో తడి ఆరకుండా ఉండటంతో పాటు మీ దంతాల ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్లు అవుతారు.

ఫైబర్ ఫుడ్ తినాలి
యాపిల్స్, క్యారట్స్, బీట్‌రూట్ లాంటి ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినడం వల్ల దంతాలు శుభ్రం అవుతాయి. 

స్ట్రా ఉపయోగించాలి..
కొన్నిరకాల పానియాలు దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మరీ ముఖ్యంగా పంచధార కలిసి పానియాలు దంతాల ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే అలాంటి పానియాలు తీసుకునేటప్పుడు స్ట్రా ఉపయోగించడం ఉత్తమం. 

స్మోకింగ్ మానేయాలి
స్మోకింగ్ అలవాటు అనేది కేవలం ఆరోగ్యానికే కాదు.. దంతాలకు కూడా మంచిది కాదు. పొగ తాగడం వల్ల దంతాలు వాటి జీవం కోల్పోతాయి. 

తరచుగా డెంటిస్ట్ ని సంప్రదించాలి
దంతాలకు ఏదైనా సమస్య ఏర్పడితే అది అంత సులువుగా తెలియదు. ఒకవేళ దంతాల్లో నొప్పి ఉంటే తప్ప తెలిసే అవకాశం ఉండదు. ముఖ్యంగా దంతాల లోపలి భాగంలో వచ్చే పుప్పి తెలిసే ఛాన్స్ అంతగా ఉండదు. అందుకే తరచుగా డెంటిస్టుని సంప్రదించడం వల్ల ఏదైనా సమస్యలు ఉంటే సకాలంలో స్పందించి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య పెద్దది కాక ముందే చెక్ పెట్టొచ్చు.

ఆయిల్ పుల్లింగ్ అనేది మన దేశంలో అనాదిగా వస్తున్న ఆయుర్వేదిక్ పద్ధతి. రోజూ ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా దంతాలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటాయి.

Trending News