Honey Facial At Home: తేనె శరీరాని రోగనిరోధక శక్తిని పెంచడానికే కాదు చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగు పర్చడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది పొడి చర్మాన్ని సమస్యల నుంచి రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తేనెని నిమ్మకాయ, పాలు, అరటిపండుతో కలిపి ముఖానికి అప్లై చేస్తే స్కిన్ టోన్ మరింత సౌదర్యంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. చర్మం సౌదర్యాన్ని పెంచుకోడానికి తేనె ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
హనీ ఫేషియల్:
ముఖమంతా తేనెను రాసి చర్మంపై 10 నుంచి 12 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అది ఆరిపోయాక చేతితో కొద్దిగా నీళ్ళు తీసుకుని మసాజ్ చేయాలి. తర్వాత తడి టవల్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి.
చర్మాన్ని రుద్దండి:
బియ్యప్పిండిని తేనెతో కలిపి తడిగా ఉన్న ముఖంపై రాయండి. ఇప్పుడు తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.
ముఖాన్ని మసాజ్ చేయండి:
తేనె, అరటిపండు తేనెలో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, దానితో చర్మం మొత్తాన్ని మసాజ్ చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
గ్లో ప్యాక్:
చర్మ రంధ్రాలు ఉన్నట్లైయితే వాటిని తొలగించేందుకు ఈ గ్లో ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గ్లో ప్యాక్ కోసం ముందుగా 3 గోధుమ పిండిని ఒక చెంచా తేనె కలపండి. దానిలోనే కొన్ని పచ్చి పాలు, రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. ఇలా ప్రతి నెల ప్యాక్‌ను ముఖానికి అప్లై చేస్తే చర్మం మరింత గ్లోగా మారుతుంది.
Also Read: High Cholesterol Food: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..!!
Also Read: Weight Loss Drink: ఈ స్పెషల్ కాఫీతో అధిక బరువును నియంత్రించుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook