Home Remedies For Health: కడుపులో సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇవి ట్రై చేయండి ఉపశమనం పొందుతారు..!!

Home Remedies For Health: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 05:10 PM IST
  • కడుపులో గ్యాస్, అజీర్ణం సమస్యలతో బాధపడుతున్నారా..
  • జీలకర్ర నీరు ట్రై చేయండి ఉపశమనం పొందుతారు
  • ఇంగువ అజీర్ణం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం
Home Remedies For Health: కడుపులో సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇవి ట్రై చేయండి ఉపశమనం పొందుతారు..!!

Home Remedies For Health: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా అవి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడాని పలు రకాల ఇంటి చిట్కాలు ఉన్నయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.  గ్యాస్, అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఏ ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

అజ్వైన్:

 గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను అధిగమించడానికి ఆకుకూరలను తినవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.అంతేకాకుండా అజ్వైన్‌ను నీటిలో మరిగించిన తాగాలని చెబుతున్నారు.

జీలకర్ర నీరు:

జీలకర్ర నీరు కూడా కడుపు సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ జీలకర్ర తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించాలి.  ఇలా చేయం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.

ఇంగువ:

ఇంగువ కూడా గ్యాస్, అజీర్ణం, అజీర్ణం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం:

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబునే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడేందుకు అల్లం దోహదపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని గోరు వెచ్చని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి.

బేకింగ్ సోడా, నిమ్మకాయ:

కడుపు సమస్యలను తొలగించడానికి బేకింగ్ సోడా, నిమ్మకాయ సహాయ పడుతాయి. దీని కోసం, అర టీస్పూన్ బేకింగ్ పౌడర్‌లో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. తర్వాత అందులో నీళ్లు, ఉప్పు కలిపి తాగాలి.

Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

Also Read: Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News