Eat Lady Fingers in Summer to Reducing High Cholesterol: ప్రస్తుత రోజుల్లో అందరూ వేయించిన ఆహారాలు మరియు నూనె, మసాలా పదార్థాలను నిత్యం తింటున్నారు. దాంతో శరీరంలో కొవ్వు మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. క్రమంగా ఈ రెండూ ధమనులకు అంటుకుంటాయి. కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. గుండెపై ఒత్తిడిని కలిగించడమే కాకుండా.. హై బీపీ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొవ్వు మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలం. కొలెస్ట్రాల్‌ను నియంత్రించగల ఆహారంను (High Cholesterol Food) తీసుకునేలా ప్రయత్నించాలి.
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బెండకాయ తినడం ప్రారంభించండి. బెండకాయ తీసుకోవడం వలన అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయ వెచ్చని సీజన్ వెజిటేబుల్ మాత్రమే కాకుండా.. మ్యుసిలేజ్ అనే జెల్‌ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మలం ద్వారా శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
మీరు బెండకాయను రెండు విధాలుగా తినవచ్చు. మీరు బెండకాయను ఉడకబెట్టి దాని నీటిని సిద్ధం చేసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు వేసవి కాలంలో ఎక్కువగా తినే బెండకాయ సబ్జీని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బెండకాయను గ్రిల్‌గా చేసుకోవాలి. ఈ రెండు విధాలుగా బెండకాయ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
బెండకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు (Health Benefits of Eating Lady Finger) ఉన్నాయి. మొదటది కొవ్వు జీవక్రియను వేగవంతం చేస్తుంది. రెండవది కొవ్వు లిపిడ్లను శరీరంలో అంటుకునేలా అనుమతించదు. ఇక మూడవది ఏంటంటే.. బెండకాయ తినడం ద్వారా షుగర్ స్పైక్ మరియు ప్రేగు కదలికలు కూడా బాగుంటాయి. దీని కారణంగా శరీరం ప్రతి ఆహారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయగలదు. అప్పుడు కొవ్వు మరియు కొలెస్ట్రాల్ పెరిగే సమస్య ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి