High Blood Pressure Treatment At Home: అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు సమస్యల కారణంగా మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే గుండె సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా DASH డైట్‌ని అనుసరించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని నేషనల్ హార్ట్, లంగ్ మరియు బ్లడ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. అంతేకాకుండా ఆహారంలో తక్కువ ఉప్పు తీసుకోవడం కూడా చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి DASH డైట్‌ను వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
DASH డైట్ ముఖ్య లక్షణాలు:
ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ తీసుకోవడాన్నే DASH డైట్ అంటారు. అంతేకాకుండా లీన్ ప్రోటీన్, గింజలు, విత్తనాలతో సహా ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్, బహుళఅసంతృప్త కొవ్వులు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
DASH డైట్ ఈ మోతాదులో ఆహారాల పోషకాలుండాయి:
అధిక రక్తపోటు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా కొవ్వు నుంచి 27% కేలరీలు, సంతృప్త కొవ్వు నుంచి 6% కేలరీలు, ప్రోటీన్ నుంచి 18% కేలరీలు, పిండి పదార్ధాల నుంచి 55% కేలరీలు, 150 mg కొలెస్ట్రాల్, 2300 mg సోడియం, 4700 mg పొటాషియం, 1250 mg కాల్షియం, 500 mg మెగ్నీషియం, 30 g ఫైబర్ గల మోతాదు గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక రక్తపోటు రోగులకు ఉత్తమ ఆహారాలు ఇవే:
హైపర్‌టెన్సివ్ రోగులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ధాన్యాలు:
ధాన్యాల్లోకి బ్రెడ్, తృణధాన్యాలు, బియ్యం, పాస్తా వస్తాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 100% తృణధాన్యాలు కలిగిన బ్రెడ్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కూడా బీపీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కూరగాయలు:
అధిక రక్తపోటు ఉన్న రోగులు టమోటాలు, క్యారెట్లు, బ్రోకలీ, చిలగడదుంపలు, ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
డైరీ:
తక్కువ కొవ్వు గల ఆహారాలు లేదా కొవ్వు రహిత పాలు, పెరుగు, చీజ్, ఇతర పాల ఉత్పత్తులు కూడా అధిక రక్తపోటు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
లీన్ మీట్:
బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మాంసం వండుకునే క్రమంలో నీటిలో ఉడకబెట్టి తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా సాల్మన్, హెర్రింగ్, ట్యూనా వంటి చేపలను తీసుకోవడం వల్ల కూడా సులభంగా అధిక రక్త పోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!
ఇది కూడా చదవండి: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook