Heart blockage management with diet: హార్ట్ బ్లాకేజీ దీన్ని కరోనరీ అర్టేరీ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి దీంతో గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడి రక్తసరఫరాకు అడ్డుగా ఉంటాయి. ఇది ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. దీంతో ఛాతి నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ముందుగానే ఈ బ్లాక్స్ గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. ఆరోగ్య నిపుణులు మన డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే కూడా అర్టేరీ బ్లాకులు నివారించవచ్చని తెలిపారు. అవేంటో తెలుసుకుందాం.
ఆర్టరీ బ్లాకులను నివారించే 5 ఆహారాలు..
చియా సీడ్స్..
చియా సీడ్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయని తెలుసు. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వాపు, హార్ట్ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తాయి.
ఫ్లాక్స్ సీడ్స్..
ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఆల్పా లైనోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యలకు చెక్ పెడతాయి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వాపు తగించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచతాయి. ఆర్టరీ బ్లాకేజీలను నివారిస్తాయి.
గుమ్మడి గింజలు..
గుప్పెడు గుమ్మిడి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యూలర్ సమస్యలు రాకుండా నివారిస్తాయి. గుమ్మడి గింజలు బీపీ లెవల్స్ నిర్వహిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపును నివారిస్తాయి. మీ గుండె ఆరోగ్యానికి గుమ్మడి గింజలు మీ డైట్లో ఉండాల్సిందే.
ఇదీ చదవండి: లవంగం టీ తాగుతున్నారా? మైండ్ బ్లాంక్ అయ్యే మిరకిల్స్..!
సన్ ఫ్లవర్ సీడ్స్..
సన్ ఫ్లవర్ సీడ్స్ ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ, ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్స్ నివారిస్తాయి. విటమిన్ ఇ ఆర్టరీ బ్లాకేజీ రాకుండా నివారిస్తుంది. సన్‌ఫ్లవర్ గింజలు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?
నువ్వులు..
నువ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో లిగనన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, హాల్తీ ఫ్యాట్స్ కార్డియోవాస్క్యూలర్ సమస్యలను నివారిస్తాయి. నువ్వుల్లో మెగ్నీషియం బీపీ లెవల్స్ నిర్వరిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook